Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ultrasound newly included in Arogya Sri Scheme.

ఆరోగ్య శ్రీ పథకంలో నూతనంగా చేర్చిన ఆల్ట్రాసౌండ్‌.

Ultrasound newly included in Arogya Sri Scheme.

టిఫా స్కాన్స్‌ మిషన్‌ లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని శుక్రవారం గుంటూరు వేదాంత ఆసుపత్రిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ... ఆల్ట్రాసౌండ్‌, టిఫా స్కాన్స్‌ ప్రతి గర్భిణీ మహిళకు ఉపయోగపడుతుందని అన్నారు. బయట ప్రైవేటుగా చేయించుకునే ఈ ఆల్ట్రాసౌండ్‌, టిఫా స్కాన్స్‌ ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించుకోవచ్చునని చెప్పారు. జగనన్న ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా 3257 కొత్తవి ఆరోగ్య శ్రీ లో చేర్చడం జరిగిందన్నారు.

రూ.26,56,000 వరకు ఆరోగ్య ఆసరా కింద అందిస్తున్నామన్నారు. 730273 మందికి ఇప్పటివరకు రూ.10,75 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి మంచి విజన్‌ తో ముందుకు వెళుతున్నారని చెప్పారు.

ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి ఏనాడు వైద్యం గురించి  ఆలోచించిన దాఖలాలు లేవనీ.. 500 కోట్ల రూపాయలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి పేద వారిని గుర్తుంచుకునే విధంగా ముఖ్యమంత్రిగా జగనన్న ఆలోచిస్తున్నారని వివరించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ultrasound newly included in Arogya Sri Scheme."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0