Western or Indian which toilet is better..? This is what doctors recommend!
వెస్ట్రన్, ఇండియన్ ఏ టాయిలెట్ మంచిది..? డాక్టర్లు సిఫార్సు చేసేది ఇదే!
మన ముందు తరాలవారు టాయిలెట్‌కు వెళ్లాలంటే గ్రామానికి దూరంగా బహిరంగ ప్రదేశాలకి వెళ్లేవారు. ప్రస్తుతం మారిన కాలానుగుణంగా ఇంటిపరిసర ప్రాంతాల్లోనే ఇండియన్ టాయిలెట్లను నిర్మించుకుంటున్నారు.
ఇప్పుడైతే అటాచ్డ్ వాష్ రూం అంటూ ఇంట్లోనే టాయిలెట్లు నిర్మించుకుంటున్నారు. ఎన్ని సౌకర్యాలు పెరుగుతున్నాయో మనిషి కూడా అన్ని రోగాల బారిన పడుతున్నాడు. వయస్సు పెరిగే కొద్ది వచ్చే మోకాలి నొప్పులు, నడుము నొప్పులకు కూర్చోలేని, నిల్చోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్‌లను పెట్టుకుంటున్నారు. అయితే ఈ వెస్ట్రన్ టాయిలెట్లను ఎక్కువగా ఉపయోగించడం వలన మరిన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఇండియన్ టాయిలెట్లు వాడడం వలన ఆరోగ్య సమస్యలు తొలగుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెస్ట్రన్ టాయిలెట్.
వెస్ట్రన్ టాయిలెట్‌ని వాడడం వలన పొట్టపైన ఎలాంటి ఒత్తిడి కలగకుండా ఉండి మలం పూర్తిగా బయటికు రాకుండా ఉంటుంది. అలాగే గర్భిణీలు వెస్ట్రన్ టాయిలెట్ పై కూర్చోవడం వల్ల వారి పొట్టపై ఒత్తిడి పడుతుంది. ఈ వెస్ట్రన్ టాయిలెట్లని ఉపయోగించినప్పుడు శుభ్రం చేసుకోవడానికి టాయిలెట్ పేపర్లను వాడతారు. దాని ద్వారా చర్మవ్యాధులు వస్తాయి. వీటితో పాటుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
ఇండియన్ టాయిలెట్
ఇండియన్ టాయిలెట్ వాడడం ద్వారా చేతులు, కాళ్లకూ మంచి వ్యాయామం చేసినట్టు అవుతుంది. లాయిలెట్లో పొజిషన్‌లో కూర్చోవడం వల్ల జీర్ణక్రియను పెంచి, రక్త ప్రసరణ మెరుగుపడేందుకు కృషి చేస్తుంది. ఈ టాయిలెట్‌పై కూర్చోడం వల్ల కండరాలకు వ్యాయామం కూడా అవుతుంది. అంతే కాదు పొట్టపై ఒత్తిడి పెరిగి పూర్తిగా మలం బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే గర్భిణీలలో గర్భాశయం పై ఎలాంటి ఒత్తిడి ఉండకుండా చేస్తుంది. అంతే కాక పెద్దప్రేగు క్యాన్సర్‌కు కూడా నివారిస్తుంది.
0 Response to "Western or Indian which toilet is better..? This is what doctors recommend!"
Post a Comment