Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why separation for the newlyweds in Ashadh.

ఆషాఢం - నవ దంపతుల ఆషాఢంలో  నవ దంపతులకు ఎందుకు ఎడబాటు.

Why separation for the newlyweds in Ashadh.

ఆషాడం అంటే అందరికీ ఇష్టమైనా,  కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు♪. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాఢంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్త గారు ఒకేచోట ఉండకూడదు♪. ఒకరికి ఒకరు ఎదురు పడకూడదని చెబుతూ ఉంటారు♪.  అంతే కాకుండా సాగు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు♪. కాబట్టి కొత్త అల్లుడికి మర్యాదల  విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశ్యంతో కూడా ఎడబాటుగా ఉంచుతారు♪.

ఆషాఢమాసంలో కొత్త దంపతులు కలిసి ఉండరాదనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు?  దీనివల్ల కలిగే అనర్థం ఏమిటి?  అసలు కలిసి ఉంటే ఏమవుతుంది♪?

ఆషాడ మాసం కాదిది, నవదంపతుల సరస శృంగారాల సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల, విరహాల ఆరూఢమాసం

అంటూ ఓ కవి దీనిని వర్ణించాడు.

ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటలకు ఎడబాటు తప్పదు.  అత్తా-అల్లుడు ఎదురు పడకూడదనే ఆచారం ఉంది.  అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలసి ఉండకూడదని అంటారు. దీనివెనుక కూడా ఒక అర్థం ఉంది.

 పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం.  సంపాదన మాట అటుంచి, తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని,  కొత్త వలపు మోజులోపడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టారు♪.

 అంతే కాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణంవల్ల బ్యాక్టీరియా, వైరస్ లు అంటువ్యాధులుగా బాగా ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్ళికూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డమీద వాటి ప్రభావం ఉంటుంది అనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి.  కావున ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండడమే  క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు.  ఈ ఆషాఢాన్ని అనారోగ్యమాసంగా పేర్కొంటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది.  కాలువలలోనూ, నదులలోనూ ప్రవహించే నీరు  అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.  ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులోని పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది♪.

అలాగే ఆషాడం తరువాత వచ్చే శ్రావణమాసంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచిరోజులే వుంటాయి. ఆ శుభ ఘడియలలో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం♪. *జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు.*  ఆషాఢంలో గర్భం దాల్చితే 9 నెలలకు అంటే చైత్రానికి పూర్తవుతుంది. ఆ సమయంలో ఎండకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్డుకోలేరని ఈ నియమం పెట్టారు.  అలాగే ఒక నెల వియోగం తరువాత కలుసుకుంటే, అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు అని కూడా అంటారు♪. 

 పూర్వ కాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది.  కష్టపడి పని చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే, వ్యవసాయ పనులు జరుగవు♪.  వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడి పోవాల్సిందే♪.  

 అందుకే, కొత్త కోడలు  పుట్టింటిలో ఉండాలి♪. అల్లుడు అత్తారింటివైపు చూడకూడదని పెట్టారుట్టారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why separation for the newlyweds in Ashadh."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0