Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

You can watch the first show on the first day without sitting at home.. Bumper offer by AP government

ఇంట్లోనే కూర్చోని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడోచ్చు. ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.

You can watch the first show on the first day without sitting at home.. Bumper offer by AP government

మూవీ లవర్స్ కి కొత్త సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటం మాంచి కిక్కునిస్తుంది. దీనికోసం థియేటర్ల దగ్గర ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్ లో పడిగాపులు కాస్తూ.

ఎంత కష్టమైనా సినిమా టికెట్ సంపాదిస్తుంటారు. అయితే చాలా మందికి టికెట్ దొరక్క ఎంతో డిసపాయింట్ అవుతుంటారు. ఒకవేళ టికెట్ దొరికినా మొదటి రోజు ఫ్యామిలీ తీసుకొని థియేటర్ కు వెళ్లి చూడటం చాలా కష్టం. ఆరోజు థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా ఆ రేంజ్ లో ఉంటుంది. చిన్న సినిమాలకు ఊతం.

తాజాగా రిలీజ్ అయిన రోజే.. కొత్త సినిమాను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసే ఫెసిలిటీని ఏపీ స్టేట్‌ ఫైబర్ నెట్ తీసుకొస్తోంది. ఈ విధానంలో నిరీక్షణ సినిమాను విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. థియేటర్లతో పాటు.. APSFL ద్వారా సినిమా విడుదల చేయడంతో చిన్న సినిమాలకు ఎంతో హెల్ప్ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫైబర్‌నెట్‌ సేవలు అందుబాటులో ఉండటంతో.. ఆయా ప్రాంతాల ప్రజలు కూడా ఇంట్లోనే సినిమా చూడొచ్చని తెలిపారు. థియేటర్లు కొద్దిమంది చేతుల్లో ఉండటంతో చిన్న సినిమాలకు హాల్స్ దొరకని పరిస్థితి ఉందని... ఈ నేపథ్యంలో వాటి మనుగడకు ఏపీ ఫైబర్ నెట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.50 లక్షల సెట్‌టాప్‌ బాక్సులు ఉన్నాయి. ఆ సంఖ్యను 50 లక్షలకు పెంచేందుకు ప్రణాళికలు వేస్తునట్లు మంత్రి వివరించారు.

సినిమా సబ్‌స్క్రిప్షన్‌ ఎలా అంటే.

సినిమా తీసే ప్రొడ్యూసర్‌కు, వీక్షించే ప్రేక్షకుడికి ఇరువురుకీ లాభం కలిగేలా.. ఏపీ ఫైబర్ నెట్ ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని APSFL ఛైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దీనిని ప్రయోగాత్మకంగా చేపడుతున్నామన్నారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇక పైరసీ సమస్యలు తలెత్తకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో తమ బృందం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. యాప్‌, ఆపరేటర్‌ ద్వారా 99 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవచ్చని, అప్పట్నుంచి 24 గంటల్లోగా సినిమాను చూడొచ్చన్నారు. ఇది ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్ చూసేలా రూపొందించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్టివిటీ ఎక్కువ ఉండటంతో పట్టణాలకు వచ్చి థియేటర్‌లో సినిమా వీక్షించలేని వారికి ఈ విధానం మరింతంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ఏ ఒక్క యాజమాన్యానికిగానీ, థియేటర్ ఓనర్స్‌కి గానీ, యాక్టర్స్‌కి గానీ ఏ రకమైన ఇబ్బంది కలిగించేది కాదని గౌతమ్‌ రెడ్డి స్పష్టం చేశారు.


థియేటర్ యాజమాన్యాలు కూడా దీని ద్వారా తమ ఆదాయం పడిపోతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. ప్రొడ్యూసర్‌లు ఎవరైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థతో మాట్లాడిన తర్వాత ఇందులో సినిమా ప్రదర్శన జరుగుతుందన్నారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను కూడా ఇదే విధానంలో విడుదల చేసేందుకు చర్చిస్తామన్నారు. నిర్మాతలు సి.కల్యాణ్‌, రామ్‌సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు ఈ వేదిక బాగా ఉపయోగ పడుతుందన్నారు. నిర్మాతలకు ఇష్టమై తేనే ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. ఫైబర్‌నెట్‌ ద్వారా విడుదల చేయడంతో పైరసీని చాలా వరకు నియంత్రించొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాంస్కృతిక విభాగాధిపతి జోగినాయుడు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నిరీక్షణ సినిమా బృందం పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "You can watch the first show on the first day without sitting at home.. Bumper offer by AP government"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0