Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP EAMCET Counseling coming soon..Registration process, required documents details.

 AP EAMCET: త్వరలో ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌, అవసరమైన డాక్యుమెంట్స్‌ వివరాలివే.

AP MSET Counseling coming soon..Registration process, required documents details.

AP EAMCET: AP EAMCET కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET) 2023 ఫలితాలు కూడా ప్రకటించారు. అయితే AP EAMCET కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది.

షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత.. అర్హత ఉన్న విద్యార్థులు అగ్రికల్చర్‌ BSc, హార్టికల్చర్‌లో BSc, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (BFSc), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ & యానిమల్ హస్బెండరీ (B.V. Sc. & A.H.), బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, BSc ఇన్ నర్సింగ్ వంటి వివిధ ప్రోగ్రామ్‌లకు అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. AP EAMCET కౌన్సెలింగ్ 2023కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

అవసరమైన డాక్యుమెంట్స్‌ వివరాలు

  • AP EAMCET ర్యాంక్ కార్డ్
  • పుట్టిన తేదీ (DOB) ప్రూఫ్‌, (10వ తరగతి మార్కు షీట్)
  • 12వ తరగతి మార్క్‌షీట్ అండ్‌ పాసింగ్‌ సర్టిఫికేట్‌
  • ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్
  • ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ రెసిడెంట్‌ సర్టిఫికేట్‌
  • ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • EWS సర్టిఫికేట్ (అవసరమైతే)
  • కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • రెసిడెన్స్‌ ప్రూఫ్‌
  • ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌
  • లోకట్‌ స్టేటస్‌ సర్టిఫికేట్‌

కౌన్సెలింగ్ ప్రాసెస్‌

రిజిస్ట్రేషన్‌

కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ కంప్లీట్‌ చేయాలి.

ఛాయిస్ ఫిల్లింగ్ అండ్‌ లాకింగ్

సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ కంప్లీట్‌ చేసిన తర్వాత, అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేసి, వారికి కావలసిన కళాశాల, కోర్సును ఎంచుకోవాలి. సెలక్ట్‌ చేసుకున్న ఆప్షన్‌లను లాక్ చేయాలి.

సీట్ల కేటాయింపు

అభ్యర్థులకు వారి ర్యాంక్, ప్రిఫరెన్స్‌, సీట్స్‌ అవైలబిలిటీ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఫీజు

సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అవసరమైన ఫీజు చెల్లించాలి.

కాలేజీకి రిపోర్ట్‌ చేయడం

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం నిర్దేశిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకురావడం తప్పనిసరి.

అప్లికేషన్‌ ఫీజు

కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు రూ.1,200 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు ఫీజు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. AP EAMCET 2023 కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థుల ర్యాంక్‌లు, ఆప్షన్‌లు, ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్ల లభ్యత ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP EAMCET Counseling coming soon..Registration process, required documents details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0