Banks have increased their working hours to 5 days a week.
బ్యాంకులు ఇక వారంలో 5 రోజులే - రోజు వారి పనివేళల పెంపు.
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. ఇక నుంచి బ్యాంకులు వారంలో అయిదు రోజులే పని చేయనున్నాయి. దీనికి బదులుగా ప్రతీ రోజు పని చేసే సమయం పెంచేందుకు రంగం సిద్దమైంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రతిపాదనలు పంపింది. వీటికి పైన ఈ నెల 28న జరిగే బ్యాంకు యూనియర్లు..బ్యాంకు అసోసియేషన్ల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం నుంచి సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది.
అయిదు రోజులు పని దినాలు: ఇక బ్యాంకులు కూడా వారంలో అయిదు రోజులు పని దినాలకు పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు ప్రతీ నెలా తొలి, మూడో శనివారం పని చేస్తున్నాయి. రెండు, నాలుగో శనివారం పని చేయటం లేదు. బ్యాంకు అసోసియేషన్ల తాజాగా డిమాండ్లలో జీతాల పెంపు, మెడికల్ సౌకర్యాలతో పాటుగా వారంలో అయిదు రోజుల పని దినాల ప్రతిపాదన ప్రధాన అజెండాగా ఉంది.
ఈ మేరకు కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రతిపాదనలు పంపింది. దీనికి బదులుగా రోజూ 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పని చేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయం పై ఈ నెల 28న యూఎఫ్బీఏ తో ఐబీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం లాంఛనంగా కనిపిస్తోంది.
రోజు వారీ వేళల పెంపు: ఎల్ఐసీ పనిదినాలను వారానికి 5 రోజులుగా మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకూ ఇదే విధానం అమలు చేయాలని ఈ నెల 19న నిర్వహించిన సమావేశంలో యూబీఎఫ్ కోరింది. దీంతో పాటుగా ఉద్యోగుల వేతనాల పెంపు..పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య భీమా పాలసీ వంటి అంశాలపైనా చర్చించి ఐబీఏకు నివేదించింది.
వీటి పైన ఈ నెల 28న ఇరు వర్గాలు సమావేశం కానున్నాయి. ఇందులో ప్రధానంగా బ్యాంకు పని దినాలపైనే నిర్ణయం తీసుకోనున్నారు. బ్యాంకుల పనిదినాలను వారానికి 5 రోజులు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్రం ఆర్దిక మంత్రి వెల్లడించారు. దీంతో ఇక నిర్ణయం ప్రకటకు ఖాయంగా కనిపిస్తోంది.
28న సమావేశంలో నిర్ణయం: వారంలో ఒక రోజు పని తగ్గుతున్నందున దీనికి బదులుగా 5 రోజుల పాటు సిబ్బంది పని వేళలను రోజూ మరో 40 నిమిషాలు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. వారానికి అయిదు రోజుల పని దినాలను అమలు చేయాలని చాలా రోజులుగా బ్యాకింగ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
ఎల్ఐసీ అమలు చేయటంతో ఇప్పుడు ఈ డిమాండ్ అమలు దిశగా ఒత్తిడి పెంచాయి. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావటంతో ఇప్పుడు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని పైన ఈ నెల 28 న జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెల్లడి కానుంది.
0 Response to "Banks have increased their working hours to 5 days a week."
Post a Comment