Do you have more than 4 SIM cards in your name.. .
మీ పేరు మీద 4 కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నాయా.. అయితే.
భారతదేశంలో రోజురోజుకు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. దీంతోపాటు ఆన్‌లైన్, సైబర్ నేరాలు సంఖ్య కూడా ఎక్కువవుతోంది. వందలాది మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. సిమ్ కార్డుల జారీలో కొత్త నిబంధనలు తీసుకురావాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓ వ్యక్తి తన పేరు మీద 9 సిమ్‌కార్డుల వరకు తీసుకోవచ్చు. అయితే ఈ నిబంధనలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా గతంలో మాదిరిగా విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకొనే అవకాశం ఉండదు. ఓ వ్యక్తి కేవలం 4 సిమ్ కార్డులే తీసుకొనేందుకు అనుమతి ఉంటుంది.
సిమ్ కార్డుల జారీ ప్రతిపాదనకు కేంద్ర టెలికాం మంత్రి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు సిమ్ కార్డు వెరిఫికేషన్‌ను పూర్తిగా డిజిటల్ విధానంలో పూర్తి చేసేలా నిబంధనలు తీసుకొస్తు్న్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
పోగొట్టుకున్న, దొంగలించబడిన ఫోన్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంచార్ సాథీ పేరుతో తీసుకొచ్చిన వెబ్‌సైట్‌లో పొగొట్టుకున్న లేదా దొంగలించబడిన ఫోన్ల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఓ వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందులో మీకు సంబంధం లేని ఫోన్ల నంబర్లను బ్లాక్ చేయాలని సంబంధిత అధికారులను ఆ పోర్టల్ ద్వారానే కోరవచ్చు.
సిమ్ కార్డుల జారీని తగ్గించడం వల్ల ఆన్‌లైన్ మోసాలను చాలావరకు అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు డిజిటల్ విధానం ద్వారా కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయడం ద్వారా చాలా వరకు మోసాలను నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం వల్ల నేరగాళ్లు సిమ్ కార్డులు పొందడం కష్టతరం కానుంది.
ఇటీవల కాలంలో సైబర్ మోసాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆశపడి కొందరు, తెలియక మరికొందరు సైబర్ మోసాల బారినపడుతున్నారు. ఒకసారి డబ్బులు చేతులు మారాక, రికవరీ చేసేందుకు చాలా సమయం పడుతుంది. మరికొన్ని సార్లు డబ్బు రికవరీ చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. అందువల్ల ఈ తరహా మోసాలకు అడ్డుకట్టే వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
సంచార్ సాథీ పోర్టల్ వల్ల పోగొట్టుకున్న ఫోన్లు, సిమ్ కార్డులు దుర్వినియోగం కాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. మొబైల్ ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడకుండా ఈ నిర్ణయాలు కొంతవరకు ఉపయోగపడవచ్చు. అయితే ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా... వ్యక్తులు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త
అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
0 Response to "Do you have more than 4 SIM cards in your name.. ."
Post a Comment