Don't tell stories about the delay of "Nadu - Nedu" work.
'నాడు-నేడు' పనుల జాప్యంపై కథలు చెప్పొద్దు.
ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
'నాడు నేడు' పనుల జాప్యంలో కథలు చెప్పొద్దని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం, రాజయ్యపేట, నక్కపల్లిలో శనివారం ఆయన పర్యటించారు. రాజయ్యపేటలో పాఠశాల గదుల్లో వైరింగ్ పనులు పూర్తికాకపోవ డంతో ఏఈ ప్రసాద్ను ప్రశ్నించారు. 15 నెలలు కావొస్తున్నా ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 'నాడు నేడు'లో పూర్తికాని పనులను కూడా పూర్త యినట్లు మీరు చెబుతుంటే దాన్నే నేను సీఎంకు వివరించాల్సి వచ్చిందన్నారు. ఏఈపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ శాఖ ప్రధాన అధికారి ప్రసాద్ను ఆదేశించారు.
నేను వచ్చానని నటించొద్దు.
కలెక్టర్ రవితో కలిసి అమలాపురంలో పాఠశా లను తనిఖీ చేశారు. విద్యార్థుల రాతపుస్తకాలు పరిశీలించారు. కొత్తగా చేరిన విద్యార్థికి అడ్మిషన్ఇవ్వలేదని, పుస్తకంలో తప్పులున్నా సరిచూడలే దని ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను వచ్చానని నటించొద్దని, ఎప్పుడూ ఒకేలా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు తమ పద్ధతి మార్చుకోకపోతే క్షమించనన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న తప్పులు మీకు కనిపించడం లేదా అంటూ డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ పాఠశాలలకు వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ సర్వేపై యాప్ పనితీరు, నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'నాడు- నేడు' పనులు పరిశీలించారు.
0 Response to "Don't tell stories about the delay of "Nadu - Nedu" work."
Post a Comment