HRA Calculation
HRA Calculation: హెచ్‌ఆర్‌ఏ ద్వారా పన్ను ఆదా. ఎలా లెక్కించాలో తెలుసుకుందాం.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కొన్ని పద్దతుల ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్‌కు జూలై 31 వరకు సమయం ఉంది.
అయితే దీనికి ముందు కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. పన్ను ఆదా మార్గాల్లో HRA (హౌజ్ రెంట్ అలవెంట్) ఒకటి. దీని ద్వారా కొంత మొత్తం పన్ను ఆదా చేసుకోవచ్చు. దీని నుంచి ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చో ఈరోజు తెలుసుకుందాం.
HRA అంటే ఏమిటి?
HRA అనేది ఐటీ చట్టంలోని సెక్షన్ 10(13A) కింద ఒక ప్రత్యేక పన్ను ఆదా నిబంధన. HRA ఉద్దేశ్యం హౌసింగ్‌పై వ్యయాన్ని తగ్గించడం. మినహాయింపుని అద్దెగా తెలియజేయవచ్చు. HRA నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మెట్రో నగరాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది పన్ను బాధ్యతను తగ్గిస్తుంది.
HRA ఎలా లెక్కిస్తారు?
మెట్రో సిటీలో ఉద్యోగం చేసే ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ.40,000 అనుకుందాం. అంటే వార్షిక వేతనం రూ.4,80,000 అవుతుంది. దీని నుంచి 11,000 రూపాయలు HRA గా పొందుతారు. అయితే మీరు జీవించడానికి రూ.14,000 ఖర్చు చేస్తే HRA మినహాయింపు మొత్తాన్ని పొందుతారు.
HRA మొత్తం రూ.11,000 x 12 = రూ.1,32,000
బేసిక్ జీతంలో 50% (మెట్రో నగరాల్లో) అంటే రూ.4,80,000లో 50% = రూ. 2,40,000
ఇంటి అసలు అద్దె, ప్రాథమిక జీతంలో 10% మైనస్ 1,68,000 (14,000 x 12) (తీసివేయండి)
రూ. 48,000 (రూ.4,80,000లో 10%) = రూ.1,20,000
ఇప్పుడు తక్కువ మొత్తంలో 1,20,000 HRA మినహాయింపుకు అర్హులవుతారు.
0 Response to "HRA Calculation"
Post a Comment