Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mutual Funds vs Gold vs Real Estate.. Which of these is the best investment option right now? .

Investments: మ్యూచువల్ ఫండ్స్ vs బంగారం vs రియల్ ఎస్టేట్‌.. ప్రస్తుతం వీటిలో ఏది బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌?

Mutual Funds vs Gold vs Real Estate.. Which of these is the best investment option right now?   .

ప్రస్తుతం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్ (Stock Market) పాజిటివ్‌ ట్రెండ్‌ కనబరుస్తోంది. కరోనా (Corona), రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో భారీగా పతనమైన మార్కెట్‌, ఇప్పుడు రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.

స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఈక్విటీ అస్సెట్స్‌కి గ్రోత్‌ పొటెన్షియల్‌ లిమిటెడ్‌గా ఉంటుంది. అయితే ఈక్విటీ అస్సెట్స్‌కి హై డిమాండ్ కారణంగా గోల్డ్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను డైవర్సిఫై చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. దీంతో సర్‌ప్లస్‌ అమౌంట్‌ ఉన్న వారికి రియల్ ఎస్టేట్ బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తుంది.

దీనికి సంబంధించి సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి 'లైవ్‌మింట్‌'తో మాట్లాడారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. రియల్ ఎస్టేట్, ముఖ్యంగా కమర్షియల్ ప్రాపర్టీలు, మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (REIT), తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారికి బెస్ట్ ఆప్షన్‌ అందిస్తాయి. ఇన్‌కమ్‌ గ్యారంటీడ్‌ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మల్టిపుల్‌ మెంబర్స్‌ నుంచి మనీ కలెక్ట్ చేస్తాయి. అయితే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే అందే ప్రయోజనాలు, REITలతో డైవర్సిఫై చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.

 రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయోజనాలు

- స్థిరమైన, సురక్షితమైన ఆప్షన్

రియల్ ఎస్టేట్ మెరుగైన లాభాలు అందించే అవకాశం ఉన్న సురక్షితమైన పెట్టుబడిగా పాపులర్‌ అయింది. మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే, రియల్ ఎస్టేట్ మరింత స్థిరత్వాన్ని అందిస్తుంది. అవసరమైన విధంగా క్యాష్‌ను కన్వెర్ట్‌ చేసుకోగల ఒక స్పష్టమైన ఆస్తిని అందిస్తుంది.

- అధిక రాబడి

కమర్షియల్ ప్రాపర్టీలు మంచి లాభాలను అందిస్తాయి, మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో సగటున రాబడి 10 శాతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హైయర్‌ రిటర్న్స్‌ అందించే పొటెన్షియల్‌ ఉంటుంది.

 ప్యాసివ్‌ ఇన్‌కమ్‌ జనరేషన్‌

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ప్యాసివ్‌ ఇన్‌కమ్‌ సోర్స్‌గా పని చేస్తాయి. రెగ్యులర్‌గా క్యాష్‌ ఫ్లోని జనరేట్‌ చేస్తాయి. ఈ స్థిరమైన ఆదాయం, రియల్ ఎస్టేట్‌ను మ్యూచువల్ ఫండ్స్‌ నుంచి వేరు చేస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో లిక్విడిటీపై పరిమితులు ఉండవచ్చు, లోయర్‌ రిటర్న్స్‌ ఉంటాయి.

- ట్యాక్స్‌ బెనిఫిట్స్‌

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు మార్ట్‌గేజ్‌ ఇంట్రస్ట్, డెప్రిసియేషన్‌ డిడక్షన్‌ వంటి ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ అందిస్తాయి. ఈ పన్ను ప్రయోజనాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి అందే మొత్తం రాబడిని మరింత పెంచుతాయి.

 ప్రత్యామ్నాయంగా REITలు

- లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ

ఇన్వెస్ట్‌ చేయడానికి తక్కువ అమౌంట్‌ ఉన్న వారికి, డైరెక్ట్‌ కమర్షియల్‌ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే REITలు మరింత అందుబాటులో ఉండే ఆప్షన్‌లు అందిస్తాయి. REITలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యాయి. వీటిని సులువుగా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. ఇన్వెస్టర్స్‌కు లిక్విడిటీని అందిస్తుంది.

- హైయర్‌ రిటర్న్స్‌

REITలు దీర్ఘకాలంలో 12% నుంచి 15% వార్షిక రాబడిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బెస్ట్‌ రిటర్న్స్‌ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా నిలుస్తాయి.

- డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్‌

 REITలను యాడ్‌ చేయడం ద్వారా, రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేస్తే, వివిధ ప్రాపర్టీలు, సెక్టార్స్‌లో ఉన్న రిస్క్‌ తగ్గుతుంది. ఈ డైవర్సిఫికేషన్‌ పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ మార్కెట్ నుంచి ప్రయోజనం పొందే అవకాశాన్ని అందిస్తుంది.

- రెసిడెన్షియల్ ప్రాపర్టీలతో జాగ్రత్త

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక దిగుబడులు, సులభమైన లిక్విడిటీ కారణంగా కమర్షియల్‌ ప్రాపర్టీస్‌, REITలపై ఫోకస్‌ ఉంటుందని పేర్కొన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mutual Funds vs Gold vs Real Estate.. Which of these is the best investment option right now? ."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0