New Guidelines for Deposit of CPS Funds
CPS నిధుల జమకు కొత్తమార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యో గులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పింఛను పథకం (సీపీఎస్) కింద ప్రతి నెలా ఉద్యోగుల వాటా సొమ్ము, ప్రభుత్వ వాటా సొమ్ము ఆ పింఛను నిధికి సక్రమంగా జమ చేసేలా ఆర్థికశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇచ్చిన ఉత్తర్వులు గురువారం విడుదల య్యాయి. గతంలో ఈ నిధుల జమకు 2012 నుంచి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చినా.. వాటిలో కొన్ని లోపా లను గుర్తించి, సరిదిద్దేందుకు ఖజానా శాఖ సంచాలకు లతో ఆర్థికశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న వికేంద్రీకరణ విధానానికి నిధులు బదిలీ చేయడం సులభమవుతుందని నిర్ణయించారు. పాత ఉత్తర్వుల స్థానంలో ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు రూపొందించితాజా ఉత్తర్వులు ఇచ్చారు.
అవి ఇలా ఉన్నాయి.
- వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పింఛను నిధి వాటా సొమ్ము, ప్రభుత్వ వాటా సొమ్ము వివరాలు సెంట్రల్ కీపింగ్ రికార్డు ఏజన్సీ (సీఆర్ఎ) కి ప్రతి నెలా 6, 11, 16 తేదీల్లో పంపిస్తారు.
- ఆ డేటా సీఆర్ఎకి అంది సక్రమంగా ఉందని భావిస్తే ఒక ఐడీ నంబరు వస్తుంది. డేటా సరిగా లేక పోతే తప్పు ఉందని సీఎఫ్ఎంఎస్కు వర్తమానం అందుతుంది.
- జీతాల బిల్లులు చెల్లించాక ఉద్యోగి పింఛను వాటా సొమ్ము చెల్లించిన సమాచారం ఆ ఉద్యోగి ఎన్ పీఎస్ ఖాతాలో ప్రతిబింబించేలా ఖజానా శాఖ సంచా లకులు అవసరమైన చర్యలు తీసుకుంటారు.
- ప్రభుత్వ వాటా కూడా జాతీయ పింఛను నిధి ఖాతాకు జమ చేసేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకు ఖజానా శాఖ సంచాలకులు బాధ్యునిగా వ్యవహరిస్తారు.
- సెంట్రల్ కీపింగు రికార్డు ఏజెన్సీలో వచ్చే అభ్యం తరాలను ఖజానా శాఖ సంచాలకులు వారం రోజుల్లోగా పరిష్కరించాలి.
- ఈ మొత్తం వ్యవహారానికి ఖజానా శాఖ సంచా లకులు నోడల్ అధికారిగా ఉంటారు. ఖజానా అధికా రులకు, రాష్ట్రంలోని ఢిల్లీలోని పే అండ్ అకౌంట్స్ అధి కారులతో సమన్వయం చేసుకోవాలి. ప్రాన్ ఖాతాలు తెరవడం, పాక్షిక ఉపసంహరణలు, పదవీవిరమణ, పింఛను పథకంలో ఉన్న ఉద్యోగి మరణిస్తే ఉపసంహ రణలు, ప్రాన్ ఖాతాల్లో వ్యక్తిగత వివరాలు మార్చాల్సి రావడం లాంటి అంశాలన్నింటినీ వారితో ఖజానా శాఖ సంచాలకులు సమన్వయం చేసుకుంటూ పూర్తిచేయాలి
0 Response to "New Guidelines for Deposit of CPS Funds"
Post a Comment