Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sravan Month 2023

Sravan Month 2023: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడో వివరణ.

Sravan Month 2023

శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాల్లో ఇళ్లు కళకళలాడిపోతుంటాయి.

హిందూ సనానత ధర్మం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో విశిష్ఠత ఉంది. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రవణం అనే పేరొచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం

శ్రావణం ఎప్పుడు మొదలు

శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఉదయం, సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. తెలుగు సంవత్సరంలో ఐదో నెల శ్రావణ మాసం. ఏటా జులై, ఆగస్టు నెలల్లో వస్తుంది. పౌర్ణమి రోజుల చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జులై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. ఈ సంవత్సరం అధికమాసం కావడం వల్ల మొదట వచ్చేది అధిక శ్రావణమాసం అంటారు. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి మొదలై సెప్టెంబరు 15 వరకూ ఉంటుంది. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం.ఈ నెలలో లక్ష్మీఆరాధన, గౌరీ ఆరాధనతో పాటూ శివారాధన అత్యంత పుణ్యఫలం అని భావిస్తారు భక్తులు.

అధికమాసంలో పూజలు తగదు

అధిక మాసం అనుష్ఠానాలకు, జపతపాలకు విశిష్టమైంది. యధాశక్తి దాన ధర్మాలు, సంతర్పణలు చేయడం మంచిది. పితృకార్యాలు మాత్రం యథావిధిగా నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. కాని నిజమాసంలో జరిగే పూజలు, నోములేవీ అధికమాసంలో నిర్వహించరు. అందుకే మంగళగౌరి వ్రతం ఆచరించేవారు, శ్రావణశుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేవారు నిజ శ్రావణంలోనే చేస్తారు. అధికమాసాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోరు.
పండుగలన్నీ నిజ శ్రావణంలోనే వస్తాయి. శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేసేవారికోసం ఈ ఏడాది నాలుగు మంగళవారాలు( ఆగస్టు 22, 29 సెప్టెంబరు 4, 11) మాత్రమే వచ్చాయి. శ్రావణ శుక్రవారం ఆగస్టు 25న వచ్చింది.

ఈసారి శ్రావణమాసంలో వచ్చే పండుగల వివరాలు-తేదీలు.

  • రాయలసీమలో నాగులచవితి- ఆగస్టు 20
  • నాగ పంచమి, గరుడ పంచమి - ఆగస్టు 21
  • శ్రావణ మంగళగౌరీ వ్రతం - ఆగస్టు 22
  • దూర్వాష్టమి - ఆగస్టు 24
  • వరలక్ష్మీ వ్రతం - ఆగస్టు 25
  • రాఖీ పౌర్ణమి - ఆగస్టు 30
  • శ్రీ కృష్ణ జన్మాష్టమి - సెప్టెంబర్ 6
  • గోకులాష్టమి - సెప్టెంబర్ 7
  • సెప్టెంబరు 14 పోలాల అమావాస్య

శ్రావణం శివుడికి ప్రీతికరం
శ్రావణమాసం అంటే కేవలం అమ్మవారి పూజలు,నోములు మాత్రమే కాదు పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రావణమాసంలో వచ్చే ప్రతిసోమవారం శివపూజ తప్పనిసరిగా చేయాలంటారు పండితులు. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉండడం వల్లే శుభకార్యాలు ఎక్కువగా శ్రావణంలో నిర్వహిస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sravan Month 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0