The prices of these will come down heavily from today.. The Center has reduced GST!
GST Rate Cut: ఈరోజు నుంచి భారీగా దిగిరానున్న వీటి ధరలు.. జీఎస్‌టీ తగ్గించిన కేంద్రం!
సామాన్యులకు ఊరట. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. కీలక ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
మోదీ సర్కార్ తాజాగా పలు ప్రొడక్టులపై జీఎస్‌టీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం అమలులోకి వస్తుంనది వెల్లడించింది. దీని వల్ల పలు రకాల ప్రొడక్టుల ధరలు దిగి రానున్నాయని చెప్పుకోవచ్చు.
భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, హోమ్ అప్లయెన్సెస్ మీద జీఎస్‌టీని తగ్గించేసింది. ఇది వరకు వీటిపై 31.3 శాతం జీఎస్‌టీ ఉండేది. అయితే ఇప్పుడు రేటు దిగివచ్చింది. టీవీలు, మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయెన్సెస్ ధరలు దిగి రానున్నాయి.
టీవీలపై జీఎస్‌టీ తగ్గింది. 27 ఇంచుల వరకు స్క్రీన్ పరిమాణం కలిగిన టీవీలపై జీఎస్‌టీ 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. అయితే దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది 32 ఇంచులు లేదా ఆపైన సైజ్‌లో ఉన్న టీవీలు కొంటూ ఉంటారు.
అయితే 32 ఇంచులు లేదా ఆపైన పరిమాణంలోని టీవీలపై ఇంకా 31.3 శాతం జీఎస్‌టీ ఉంది. అంటే మీరు తక్కువ స్క్రీన్ ఉన్న టీవీ కొంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ టీవీలపై అయితే రేట్లు అలానే ఉంటాయి.
మొబైల్ ఫోన్లపై ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించేసింది. ఇది వరకు మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ 31.3 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు జీఎస్‌టీ 12 శాతానికి తగ్గింది. దీని వల్ల మొబైల్ ఫోన్ కంపెనీలు ఫోన్ల ధరలు తగ్గించనున్నాయి.
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్యాన్లు, కూలర్లు, గ్లీజర్ వంటి వాటి ధరలు కూడా తగ్గనున్నాయి. హోమ్ అప్లయెన్సెస్‌పై జీఎస్‌టీ 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. అంటే ధరల తగ్గింపు 12 శాతం వరకు ఉండొచ్చు.
అలాగే మిక్సర్లు, జ్యూసర్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఎల్ఈడీ లైట్లు, వాక్యూమ్ ఫ్లాస్క్ వంటి వాటిపై కూడా జీఎస్‌టీ దిగి వచ్చింది. ఇది వరకు మిక్సర్లు, జ్యూసర్లు వంటి వాటిపై జీఎస్‌టీ 31.3 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ రేటు 18 శాతానికి తగ్గింది. అలాగే ఎల్ఈడీలపై జీఎస్‌టీ 15 శాతం నుంచి 12 శాతానికి దిగి వచ్చింది.
ఎల్‌పీజీ స్టవ్ మీద జీఎస్‌టీ 21 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. అలాగే కుట్టు మిషన్ల మీద జీఎస్‌టీ 16 శాతం నుంచి 12 శాతానికి దిగి వచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఏ ఏ ప్రొడక్టులపై ఎంత వరకు జీఎస్‌టీ తగ్గిందో ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
0 Response to "The prices of these will come down heavily from today.. The Center has reduced GST!"
Post a Comment