Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Govt Good News, Instructions for filling 597 Group 1, Group 2 Posts.

Ap Government: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 597 గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆదేశాలు.

AP Govt Good News, Instructions for filling 597 Group 1, Group 2 Posts.

Ap Government: గ్రూప్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడనుంది. పోస్టుల భర్తీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేయడంతో ఇక మిగిలిన ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్ 1 కేటగరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగరీ-2, అసిస్టెంట్ కమీషనర్ ( ఎస్టీ) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార, బీసీ సంక్షేమ శాఖ, ఆర్ధిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవిన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు భవనాల శాఖల్లో గ్రూప్ 1 పోస్టుల్నిఏపీపీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేయనున్నారు. 


ఇక ఏపీ సచివాలయంలోని ఆర్ధిక, సాధారణ పరిపాలన, న్యాయ, లెజిస్లేచర్ శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ కానున్నాయి. గ్రూప్ 2 లో అత్యధికంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 161,   ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 150, డిప్యూటీ తహశిల్దార్ ( గ్రేడ్ 2) పోస్టులు 114 ఉన్నాయి.గ్రూప్ 1 కేటగరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగరీ-2, అసిస్టెంట్ కమీషనర్ ( ఎస్టీ) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఇక గ్రూప్-2 కేటగరీలో డిప్యూటీ తహశిల్దార్ ( గ్రేడ్-2), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2తో పాటు మరి కొన్ని ఉద్యోగాల భర్తీకు ఏపీపీఎస్సీకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తం 597 పోస్టులు భర్తీ కానున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Govt Good News, Instructions for filling 597 Group 1, Group 2 Posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0