Chandrayaan 3 is another key update.. the rover that sent the temperature test report of the moon.
Chandrayaan-3: చంద్రయాన్ 3 మరో కీలక అప్‌డేట్.. చంద్రుని ఉష్ణోగ్రత పరీక్ష నివేదికను పంపిన రోవర్.
ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని ప్రయోగించి విజయవంతం చేసిన విషయం తెలిసిందే. గతంలో చంద్రయాన్ 2 విఫలం కావడంతో దాని నుంచి ఇస్రో ఎన్నో పాఠాలు నేర్చుకుంది.
మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఇస్రో గ్రాఫ్‌తో వివరించిన రోవర్ సమాచారం. ఇస్రో ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా పంచుకుంది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువంలో ప్రయాణిస్తోంది. అలాగే ఇప్పుడు అది సెన్సార్ల ద్వారా చంద్రుని ఉష్ణోగ్రతను పరీక్షించింది. చంద్రుడిపై 10 సెంటీమీటర్ల లోతుకు 10 సెన్సార్లు దిగాయని ఇస్రో తెలిపింది.
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద మట్టిని అధ్యయనం చేయడం ప్రారంభించింది. విక్రమ్ ల్యాండర్‌పై అమర్చిన సెన్సార్లు దక్షిణ ధ్రువం వద్ద ఉష్ణోగ్రత సమాచారాన్ని ప్రసారం చేశారు శాస్త్రవేత్తలు. ఇస్రో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సహాయంతో పేలోడ్ చంద్రునిపై ఉష్ణోగ్రత ఎంత? ఇది ఎలా మారుతుందో సమాచారం గ్రాఫ్ ద్వారా వివరించారు.
ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చంద్రుని దక్షిణ ధృవ రహస్యాలను అన్వేషిస్తున్నట్లు ఇస్రో తెలియజేసింది. ఇటీవలే ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ ల్యాండర్ నుంచి దిగి 8 మీటర్లు కదులుతున్న వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ వద్ద 12 మీటర్లు కదులుతూ కుడివైపుకు తిరుగుతున్న వీడియోను కూడా ఇస్రో విడుదల చేసింది. అడుగడుగునా ఇస్రో లోగో, అశోక లాంచన్ కనిపించాయి. ఇప్పుడు పేలోడ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్ర నేల, రాళ్ల భౌతిక కూర్పును అధ్యయనం చేసింది.
మొత్తానికి చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాలుగు రోజులకే పలు సమాచారం రాగా, ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం ప్రారంభించారు.
0 Response to "Chandrayaan 3 is another key update.. the rover that sent the temperature test report of the moon."
Post a Comment