CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy: ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. దసరా కానుకగా డీఏ ప్రకటన.
CM Jagan Announces to Release Pending DA: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. జూలై-2022కు సంబంధించిన డీఏను దసరా పండుగ నాడు ఇస్తామని ప్రకటించారు.
మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేయడంలో నాలుగు అడుగులు ముందుంటుందని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21వ రాష్ట్ర మహా సభలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. తమకు, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులు అని.. వారి సంతోషం, భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తామని ప్రకటించారు.
ఎప్పుడూ నిజాయితీ కమిట్‌మెంట్‌తోనే అడుగులు వేశామని అన్నారు సీఎం జగన్. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ప్రభుత్వం మనదని.. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించామని.. 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.
0 Response to "CM Jagan Mohan Reddy"
Post a Comment