Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

HDFC, Kotak Bank Scholarship for Talents

HDFC, కోటక్ బ్యాంక్ ప్రతిభా వంతులకు స్కాలర్ షిప్

HDFC, Kotak Bank Scholarship for Talents

 ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం దేశంలోని రెండు ప్రైవేట్‌ బ్యాంకులు కొన్ని రకాల స్కాలర్‌ షిప్‌లని అందిస్తున్నాయి. అందులో ఒకటి HDFC బ్యాంక్ పరివర్తన్ ECSS ప్రోగ్రామ్ 2023 - 24. దీనికింద పాఠశాల విద్యార్థులకి, యూజీ విద్యార్థులకి, పీజీ విద్యార్థులకి వేర్వేరు స్కాలర్‌షిప్‌లు అందుతాయి. అంటే ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కోటక్ బ్యాంకు కొటాక్ కన్యా స్కాలర్‌షిప్ పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. 

HDFC స్కాలర్‌షిప్‌లు

1. HDFC బ్యాంక్ మూడు స్థాయిల్లో ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది. మొదటి స్కాలర్‌షిప్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అలాగే డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు, మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ కింద స్కాలర్‌షిప్ అందిస్తుంది. దీని కోసం 30 సెప్టెంబర్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకి రూ.15,000 వరకు సహాయం లభిస్తుంది. 

2. ఇతర స్కాలర్‌షిప్‌లు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించినవి. యూజీ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 30 సెప్టెంబర్ 2023. దీని కింద రూ.30 వేల వరకు సాయం లభిస్తుంది.

3. మూడో స్కాలర్‌షిప్ పీజీ కోర్సులకి సంబంధించినవి. వీటి చివరి తేదీ కూడా సెప్టెంబర్‌ 30. దీని కింద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులకు రూ.35 వేల వరకు సహాయం అందజేస్తారు.

ఈ స్కాలర్‌ షిప్‌లు ఒకటో తరగతి నుంచి పీజీ వరకు గల విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా సమాజంలోని వెనుకబడిన తరగతుల పిల్లలకి వీటిని మంజూరుచేస్తారు. భారతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ స్కాలర్‌షిప్‌లకి అప్లై చేసుకోవడానికి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. అభ్యర్థి అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. దీని కోసం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటాయి. వివరాల కోసం hdfcbank.com వెబ్‌సైట్‌ని సందర్శించండి.

కోటక్ కన్యా స్కాలర్‌షిప్

ఈ స్కాలర్‌షిప్ కోటక్ మహీంద్రా గ్రూప్ ప్రాజెక్ట్. ఇది సమాజంలోని పేద వర్గాల బాలికల విద్యకు సహాయపడే లక్ష్యంతో రూపొందించారు. తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి వచ్చిన బాలికలకు దీని కింద సహాయం చేస్తారు. గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, డిజైన్, లా వంటి కోర్సులు ఉన్నాయి. 

దీని కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు సాయం అందిస్తారు. డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ మొత్తాన్ని అందిస్తారు. ఇందుకోసం అభ్యర్థి 12వ తరగతిలో కనీసం 85 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే అతని కుటుంబ వార్షికాదాయం ఏడాదికి రూ.6 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటాయి. చివరి తేదీ 30 సెప్టెంబర్ 2023. వివరాలు, దరఖాస్తు కోసం kotakeducation.org వెబ్‌సైట్‌ని సందర్శించండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "HDFC, Kotak Bank Scholarship for Talents"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0