Is this how schools are monitored?
పాఠశాలల పర్యవేక్షణ ఇలాగేనా?
ఉన్నతాధికారుల తీరుపై ప్రవీణ్ ప్రకాష్ అసంతృప్తి
'ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ల వినియోగం సరిగా లేదు. విద్యార్ధులు రాసిన నోట్పస్తకాలను ఉపాధ్యా యలు పరిశీలించడం లేదు. పాఠశాల లను ఉన్నతాధికారులు పర్యవేక్షించే తీరు ఇదేనా?' అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిలదీశారు. తూర్పుగోదా వరి జిల్లా బిక్కవోలు ఉన్నత పాఠశాల, రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇదే మండలం వీరంపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, ప్రభుత్వం అందించిన ట్యాబ్ల వినియోగం తీరును పరిశీలిం చారు. విద్యార్థుల నోటుపుస్తకాలు ప్రధానోపాధ్యా _యుడు పరిశీలించారా? లేదా? గమనించారు. ఆశించిన విధంగా లేకపోవడంపై ఆర్జేడీ, డీఈవోలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిక్కవోలులో తొమ్మిదో తరగతి గదికి వెళ్లి విద్యార్థుల ట్యాగ్లు తీసుకుని పరి శీలించారు. వినియోగం తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయుడు శ్రీనివాసు ట్యాబ్ ఇవ్వాలని కోరారు. ఆయన ట్యాబ్ తీసుకురాకపోవడంపై ప్రవీణ్ ప్రకాష్ మండిపడ్డారు. 'సోమవారం స్పందన మినహా ఏ కార్యక్రమాలు ఉండవు కదా..! రోజూ పాఠశాలలను సందర్శించకపోవడానికి కారణమేంటి' అని డీఈవో అబ్రహంను ప్రశ్నించారు. మళ్లీ ఆకస్మిక తనిఖీలు చేస్తానని, పరిస్థితుల్లో మార్పు రావాలని ఆదేశించారు.
ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం
రంగంపేట మండలం వీరంపాలెం. లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నోటుపుస్తకాలు ప్రధానోపాధ్యాయుడు
సత్యనారాయణపరిశీలించలేదని |ప్రవీణ్ ప్రకాష్ గుర్తించారు. జులై నాటికి పాఠ్యాంశాల బోధన ఎందుకు పూర్తి చేయలేదని ప్రధానోపాధ్యాయుడిపై మండిపడ్డారు.
0 Response to "Is this how schools are monitored?"
Post a Comment