Lifting of suspension on Rahul Gandhi.. Notification restoring membership of Lok Sabha
Rahul Gandhi: రాహుల్‌గాంధీపై సస్పెన్షన్ ఎత్తివేత.. లోక్‌సభసభ్యత్వం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందే లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది.
ఐదు నెలలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయపోరాటం ఫలించింది. మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2019 ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు దాఖలు చేశారు. నీరవ్‌మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ – ఇలా దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఉందేంటి అని రాహుల్ గాంధీ ఏప్రిల్ 13, 2019న కర్నాటకలోని కోలార్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. మోదీ అనే ఇంటి పేరున్న అందరినీ రాహుల్ గాంధీ అవమానించారని పూర్ణేష్ మోదీ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు.
రాహుల్‌కి సుప్రీంకోర్టు నుంచి ఊరట
దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి మార్చి 23, 2023న రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను నెల రోజులపాటు నిలుపుదల చేసింది. దానిపై నాలుగు నెలలుగా రాహుల్ గాంధీ సూరత్ జిల్లా కోర్టు, గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తగిన కారణాలు చూపలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆ శిక్షపై స్టే విధించింది. దీంతో రాహుల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటరీ పునరుద్ధరించారు.
మోదీ ఇంటిపేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌కు సూరత్‌లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. అయితే శుక్రవారం ఈ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇస్తూ రెండేళ్ల శిక్షపై స్టే విధించింది.
అటువంటి కేసులో ఇది గరిష్ట శిక్ష అని సుప్రీం కోర్టు కఠినమైన వ్యాఖ్యను చేసింది, అయితే దిగువ కోర్టు 2 సంవత్సరాల శిక్షను సమర్థించే వాదనను ఇవ్వలేదు. ఈ కేసులో తక్కువ శిక్ష విధించవచ్చు. ఈ విషయాన్ని పేర్కొంటూ, సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించింది, ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది.
పార్లమెంట్ ఇచ్చిన కాపీని ఇక్కడ చూడగలరు.
0 Response to "Lifting of suspension on Rahul Gandhi.. Notification restoring membership of Lok Sabha"
Post a Comment