PM Yashasvi Yojana
పీఎం యశస్వి యోజన: పాఠశాల విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్ ఇచ్చే పథకం. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఆగస్ట్ 10.
దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలోపు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.
దీని ద్వారా రూ. 75,000 నుంచి రూ 1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందజేస్తోంది. ఈ పథకం పేరు ''పీఎం యశస్వి యోజన.
యశస్వి పథకం అంటే?
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే పీఎం యశస్వి యోజన.
ఈ పథకం పూర్తి పేరు ''ప్రైమ్ మినిస్టర్- యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (పీఎం-వైఏఎస్‌ఏఎస్‌వీఐ). అయితే, ఇది యశస్వి స్కాలర్‌షిప్ పథకంగానే అందరికీ ఎక్కువగా తెలిసింది.
ఇతర వెనుకబడిన కులాలు (OBC), ఆర్థికంగా వెనుకబడిన కులాలు(EBC), డీ నోటిఫైడ్ (తెగలు), నొమాడిక్ (సంచార), సెమీ నోమాడిక్ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేయడంతో పాటు దాన్ని పర్యవేక్షిస్తుంది.
తొమ్మిది నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
అర్హులు?
9వ తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నవారు, సీబీఎస్ఈ ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థులు.
ఉపకార వేతనం ఎంత ఇస్తారు?
9వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.75 వేలు, 11వ తగతి విద్యార్థికి రూ.1.25లక్షల ఉపకారవేతనం ఇస్తారు.
విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి ఎంత ఉండాలి?
విద్యార్థి కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ. 2.50లక్షలకు మించి ఉండకూడదు.
ప్రతీ విద్యార్థికి స్కాలర్‌షిప్ ఇచ్చేస్తారా?
ఇవ్వరు. దేశంలోని కేంద్ర పాలితప్రాంతాలు సహా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక్కో రాష్ట్రం నుంచి ఇంతమందిని ఈ పథకానికి ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ల కొరకు మొత్తం 1,401 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 1,001 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
స్కాలర్ షిప్ ఎలా చెల్లిస్తారు?
విద్యార్థికి చెందిన ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు.
ఎంపిక ఎలా?
ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఇందులో మెరిట్ ప్రకారం విద్యార్థులను ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది.
పరీక్ష పద్ధతి ఎలా ఉంటుంది?
ఇది రాతపూర్వకంగా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) విధానంలో ఓఎంఆర్ షీట్స్‌పైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటలు.
ఏయే సబ్జెక్టులు ఉంటాయి?
మ్యాథమ్యాటిక్స్: 30 ప్రశ్నలు-120 మార్కులు
Science: 20 ప్రశ్నలు-80 మార్కులు
సోషల్ సైన్స్: 25 ప్రశ్నలు-100 మార్కులు
జనరల్ నాలెడ్జ్: 25 ప్రశ్నలు-100 మార్కులు
పరీక్ష ఏ భాషలో ఉంటుంది?
ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో పరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఈ స్కాలర్‌షిప్ కొరకు విద్యార్థులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది
https://yet.nta.ac.in/frontend/web/site/login
ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే విధానం?
విద్యార్థులు ముందుగా పైన చెప్పిన అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
వెబ్‌సైట్‌లో రిజిస్టర్ లింక్‌పైన క్లిక్ చేయాలి
తరువాత మీ పేరు, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ను టైప్ చేసి మీకు ఒక లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, తరువాత దాని కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
ఈ నెల అంటే ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆ రోజు రాత్రి 11.50 నిమిషాల వరకు ఈ వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం కుదరదు.
దరఖాస్తులో తప్పులుంటే కరెక్షన్ చేసుకోవచ్చా?
దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు ముగిశాక, దరఖాస్తులో కరెక్షన్ల కొరకు కొంత గడువు ఇచ్చారు.
ఆగస్టు 12వ తేదీ నుంచి 16వ తేదీలోపు మీ దరఖాస్తులో ఏవైనా కరెక్షన్లు చేయాల్సి వస్తే చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు ఎంత?
ఒక్క నయాపైసా కూడా చెల్లించక్కర్లేదు. పరీక్షకు పూర్తి ఉచితంగానే దరఖాస్తు చేసుకుని రాయొచ్చు.
పరీక్ష తేదీ ఎప్పుడు?
సెప్టెంబరు 29వ తేదీ శుక్రవారం పరీక్ష నిర్వహిస్తారు
0 Response to "PM Yashasvi Yojana"
Post a Comment