Railway Recruitment 2023
Railway Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. 2409 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.
నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే (CR)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
మొత్తం ఖాళీలు 2409
మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrccr.com ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు ఐటీఐ విద్యార్హతను కలిగి ఉండాలి.
ఎలా అప్లై చేయాలో వివరణ
Step 1:అభ్యర్థులు మొదటగా rrccr.com వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2:హోం పేజీలో మీకు నోటిఫికేషన్ కు సంబంధించిన విభాగంలో Click here to Online Application Process ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3:తర్వాత మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 4:తర్వాత మీ లాగిన వివరాలను నమోదు చేసుకుని అప్లికేషన్ ను పూర్తి చేయాలి.
Step 5:భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
0 Response to "Railway Recruitment 2023"
Post a Comment