SBI Debit Card
SBI Debit Card: ఎస్‌బిఐ ఎటీఎం కార్డు వాడట్లేదా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? మీకు ATM కార్డ్ ఉందా? మీరు మీ ATM డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం లేదా? మీరు చాలా రోజులుగా Google Pay, Phone Pay వంటి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?
అయితే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాడ్ న్యూస్ చెప్పింది. మీ ATM కార్డ్ గడువు ముగియబోతుంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్‌గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా పంపుతాయి. కానీ, మీరు కార్డును ఉపయోగించకపోతే, మీకు కొత్త కార్డు లభించదు. SBI ATM కార్డ్‌ని తిరిగి జారీ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డును పంపుతుంది. మీ ATM డెబిట్ కార్డ్ గడువు ముగిసి, కొత్త కార్డు ఇంటికి వచ్చే వరకు వేచి ఉంటే, మీరు ఇబ్బందుల్లో పడతారు. కొన్ని సందర్భాల్లో కార్డు రాకపోవచ్చు. దీంతో ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లల్ ఓ కస్టర్ కు ఎదురుకావడంతో లబోదిబో మన్నాడు.
తాజాగా ఓ కస్టమర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఖాతాదారుడు ట్విట్టర్‌లో తనకు ఎదురైన ఇబ్బందులపై బ్యాంకుకు ఫిర్యాదు చేశాడు. తన ఏటీఎం కార్డు గడువు ముగిసినా బ్యాంకు నుంచి కొత్త కార్డు ఇవ్వలేదన్నారు. 10 సంవత్సరాల నుండి SBI ఖాతాను ఉపయోగిస్తున్నానని, ఇటీవలే తన ATM కార్డ్ గడువు ముగిసిందని అన్నాడు. కానీ, ఆటోమేటిక్‌గా నా అడ్రస్‌కు ఏటీఎం కార్డు పంపకుండా, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోమని బ్యాంకు కోరిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ కస్టమర్ ట్వీట్‌పై ఎస్‌బీఐ ట్విట్టర్‌లోనే స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో వివరించింది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఖాతా కాకపోతే మాత్రమే కార్డు ఆటోమేటిక్‌గా పంపబడుతుందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. డెబిట్ కార్డ్ కస్టమర్ గత 12 నెలల్లో కనీసం ఒక్కసారైనా ఉపయోగించినట్లయితే మాత్రమే కొత్త కార్డు జారీ చేయబడుతుంది. గత 12 నెలల్లో ఏటీఎం కార్డును ఒక్కసారి కూడా ఉపయోగించకుంటే, మీ కార్డు గడువు ముగిసినట్లయితే, మీ ఇంటికి కొత్త కార్డు రాదు. మీ ATM కార్డ్ గడువు ముగిసినప్పుడు, కొత్త కార్డ్‌ని పొందడానికి మీ PAN నంబర్‌ని తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. మీ SBI ఖాతాకు మీ PAN నంబర్ లింక్ చేయకపోతే, మీ ATM కార్డ్ గడువు ముగిసిన తర్వాత మీకు కొత్త కార్డ్ లభించదు. మీరు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మీరు బ్యాంకుకు వెళ్లి, KYC పత్రాలను సమర్పించి, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
0 Response to "SBI Debit Card"
Post a Comment