Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What are the danger signs in the body when cholesterol increases?

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎలాంటి ప్రమాద సంకేతాలు కనిపిస్తాయి.

What are the danger signs in the body when cholesterol increases?

మన బిజీ లైఫ్ స్టైల్ వల్ల వ్యాయామానికి సమయం కేటాయించలేనప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండేందు కోసం ప్రతి రోజు వ్యాయమంతో పాటు పోషకాలున్న ఆహారం తీసుకోవడం మంచిది.

ఇది కాకుండా, మనం ఎక్కువ నూనెతో కూడిన ఆహారాలను తీసుకుంటే అది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అందుకే అధిక నూనెతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, రక్త నాళాల వ్యాధి, కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రకరకాల సమస్యలు తలెత్తినప్పుడు నమం చేసుకునేందుకు ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక కొలెస్ట్రాల్‌ను గుర్తించడం ఎలా..?

మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గుర్తించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడాన్నిరక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అయితే చాలా సార్లు ఇటువంటి సమస్యలు శరీరంలో పెరగడం మొదలవుతాయి. ఇది ఈ ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభించినప్పుడు మన పాదాలలో నొప్పి పెరుగుతుంది. అలాగే ఈ హెచ్చరికలను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది తరువాత ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

పాదాల నుంచి వచ్చే ఈ సంకేతాలను విస్మరించవద్దు

1. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలోని నరాలు సమస్య పెరుగుతుంది. అదే పరిస్థితి కాళ్ళ సిరలతో కూడా జరుగుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ శరీరం అత్యల్ప భాగాలకు చేరుకోదు. అలాగే ఇది తీవ్రమైన నొప్పికి కారణం అవుతుంది. సాధారణం చాలా మందికి కాళ్ల నొప్పులు ఉంటాయి. ఇందుకు కారణం రకరకాలుగా ఉన్నా.. కొలెస్ట్రాల్‌ స్థాయి పెరగడం వల్ల కూడా సమస్యలు తలెత్తవచ్చని గుర్తించుకోండి.

 2. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు, ఆ వ్యక్తికి పాదాలలో తిమ్మిరి మొదలవుతుంది. కొన్నిసార్లు రాత్రి నిద్రిస్తున్నప్పుడు పాదాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే, కాసేపు నిలబడితే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అలాగే ఇది నొప్పిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

3. పెరుగుతున్న కొలెస్ట్రాల్ అత్యంత షాకింగ్ లక్షణాలలో ఒకటి పాదాలు, గోర్లు రంగు మార్పు. తరచుగా అవి పసుపు రంగులోకి మారుతుంటాయి. పాదాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా రంగు మారిన సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు.

4. చలికాలంలో పాదాలు చల్లగా ఉండటం సర్వసాధారణం. అయితే వేసవిలో లేదా సాధారణ ఉష్ణోగ్రతలో కూడా పాదాలు అకస్మాత్తుగా చల్లగా ఉన్నట్లయితే ఇది ప్రమాదానికి సంకేతమని అర్థం చేసుకోండి. అలాగే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What are the danger signs in the body when cholesterol increases?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0