10 Amazing Health Benefits of Ginger
అల్లంతో కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయజనాలు
1. జీర్ణ సమస్యలు ఎలాంటివైనా సరే.. అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కాస్తంత అల్లం రసం సేవిస్తుంటే అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. అలాగే వికారం, వాంతులు కూడా తగ్గుతాయి.
2. దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లంను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దంతాలను తోముకోవాలి. దీంతో చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది._*
3. సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించేందుకు కూడా అల్లం పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
4. అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి అల్లం మేలు చేస్తుంది. రోజు అల్లం కషాయం తాగుతున్నా లేదా అల్లం రసాన్ని పరగడుపునే తీసుకుంటున్నా.. ఆయా సమస్యలు తగ్గుతాయి.
5. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణం అల్లంలో ఉంది. కనుక అల్లం రసాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో పరగడుపునే సేవించాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు మొత్తం బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
6.అల్లం రక్తాన్ని పలుచన చేసి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు అల్లంకు ఉన్నాయి. అల్లంను రోజూ తీసుకుంటే రక్త సరఫరా మెరుగు పడి హైబీపీ తగ్గుతుంది.ఒంట్లో నొప్పులు తగ్గుతాయి.
7. అల్లంను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
8. మహిళలు నెలసరి సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపునే సేవించాలి.
9. క్యాన్సర్ రాకుండా చూసే గుణాలు అల్లంలో ఉన్నాయి. కనుక అల్లంను రోజూ తీసుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
10. అధిక బరువును తగ్గించడంలో.. కొవ్వును కరిగించడంలో అల్లం సహాయపడుతుంది. పరగడుపునే అల్లం రసం సేవిస్తుంటే.. మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. ఇలా అల్లంతో మనం అనేక లాభాలను పొందవచ్చు.
0 Response to "10 Amazing Health Benefits of Ginger"
Post a Comment