అమెరికా నుంచి తిరిగొచ్చేస్తున్న భారతీయులు.. అసలు కారణాలు.
అమెరికా నుంచి తిరిగొచ్చేస్తున్న భారతీయులు.. అసలు కారణాలు.
నిర్దిష్ట ఉద్యోగాలలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అమెరికా H-1B వీసా( H1 B Visa )ను జారీ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడిసిన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో మెరుగైన డిగ్రీ ఉన్న ప్రొఫెషనల్ వ్యక్తులకు అమెరికా ఈ వీసాను జారీ చేస్తుంది.
అమెరికా( America )లో దొరికే ఉద్యోగాలు, అక్కడ లభించే జీతం వల్ల ఆ దేశానికి ఎక్కువ మంది మన దేశం నుంచి వెళ్తున్నారు. చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా చాలా మందికి అమెరికానే ఫస్ట్ ఛాయిస్.
అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. అమెరికా వెళ్లే భారతీయులు అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. భారత్ ముద్దు అమెరికా వద్దు అనుకుంటున్నారు. దీనికి గల కారణాలను తెలుసుకుందాం.ఉద్యోగ వీసా( Employement Visa )పై అమెరికాలో ఉంటున్న వారు అక్కడ ఖచ్చితంగా జాబ్ చేస్తుండాలి.
లేకపోతే అన్నీ సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం పోతే మూడు నెలల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోవాలి. మరో ఉద్యోగంలో చేరిన ధృవపత్రాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందజేయాలి. అలా అయితేనే అక్కడ ఉండడానికి అనుమతి ఉంటుంది.
అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులకు లే ఆఫ్‌లు( Lay Offs in America ) ఇస్తున్నాయి. మరో ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఇటీవల 18 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
తిరిగి మరో ఉద్యోగం దొరక్కపోవడంతో కుటుంబంతో సహా భారత్‌కు తిరిగి వస్తున్నారు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని, తిరిగి స్వదేశానికి( India ) వస్తున్నారు. దూరపుకొండలు నునుపు అనే సామెత ఇప్పుడు చాలా మంది అమెరికా వెళ్తున్న వారికి అర్ధం అవుతుందని చాలా మంది పేర్కొంటున్నారు.
0 Response to "అమెరికా నుంచి తిరిగొచ్చేస్తున్న భారతీయులు.. అసలు కారణాలు."
Post a Comment