Curd Health Benefits
Curd Health Benefits : పెరుగులో వీటిని కలుపుకొని తినండి చాలు .. సగం రోగాలు మాయమవుతాయి .
పెరుగు(Curd) ఒంటికి ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో పెరుగు తినడం శరీరానికి మేలు చేస్తుంది. వేసవి(Summer)లో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది.
పెరుగు, జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అధిక బరువుతో ఇబ్బంది పడే వారు పెరుగుతో జీలకర్ర కలిపి తింటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారట. జీలకర్రను వేడి చేసి.. ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టి పొడిగా మార్చి పెరుగుతో కలిపి తినాలి. పెరుగును చక్కెరతో కలిపి తినడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. వీటికి కలిపి తినడం వల్ల గొంతులోని కఫం సమస్య కూడా దూరమవుతుందట. శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉపవాస సమయంలో చాలా మంది రాక్ సాల్ట్‌తో కలిపిన పెరుగును తింటుంటారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుందట.
పెరుగు, వాము కలిపి తినడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి పోతుంది. దీంతో పాటు అల్సర్ సమస్య కూడా తగ్గుతుంది. పెరుగులో నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలిపి తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందట. మూడు చెంచాల పెరుగులో రెండు చెంచాల నల్ల మిరియాల పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకుని… ఆ మిశ్రమాన్ని జుట్టుకు పటించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారడం సహా జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందట.
0 Response to "Curd Health Benefits"
Post a Comment