Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

History of Gandhi family

History of Gandhi family: నెహ్రూ వారసులకు 'గాంధీ' ఇంటి పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది.

‘గాంధీ’ ఇంటిపేరుపై మళ్లీ వివాదం రాజుకుంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘గాంధీ’ బిరుదును వదులుకోవాలంటూ అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ ఆదివారం (సెప్టెంబర్ 10) కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ప్రతిపక్షాలందరూ నకిలీల నాయకులుగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. కర్నాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు భారత్‌ జోడో యాత్రను నిర్వహిస్తారు. ఎన్నికలు ముగియగానే ‘భారత్‌’పై వివాదం సృష్టిస్తున్నారు. మనది ఇండియా అని డూప్లికేట్‌ల నేతలు చేబుతున్నారు. గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఆ తర్వాత గాంధీ ఇంటిపేరు పట్టుకుని మీరంతా డూప్లికేట్ గాంధీలయ్యారు. గాంధీ కుటుంబం నుంచి గాంధీ ఇంటిపేరును అపహరించిన తొలి అవినీతి పరులుగా పేర్కొన్నారు. ఇండియాలో మొదటి స్కామ్ ఈ ‘టైటిల్’ స్కామూ. దేశాన్ని లాక్కొని ఇండియా అయిపోవాలనుకుంటున్నారు. రేపు గాంధి ఇంటిపేరును దొంగిలిస్తే అతను సాధువు అవుతాడా? మీరు భారతదేశానికి కీర్తిని తెచ్చే పనిని ఎన్నడూ చేయలేదు. ఇండియా అనే పేరును తీసుకొచ్చి పాపం చేసారు. ‘భారత్’ అనే పేరును తీసుకునే హక్కు మీకు లేదు. కనీసం రాహుల్ గాంధీ తన పేరులోని డూప్లికేట్ టైటిల్ ‘గాంధీ’ అనే ఇంటిపేరును విడనాడాలని అభ్యర్ధిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ.. హిమంతవిశ్వ శర్మ బహుశా వరుణ్ గాంధీ గురించి మాట్లాడి ఉంటారని అనుకుంటున్నానంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీ సభ్యుడుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి గాంధీ ఇంటిపేరును రాజకీయ ప్రయోజనాల కోసం నెహ్రూ కుటుంబం దొంగిలించిందని గతంలోనూ చాలా సందర్భాల్లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా గాంధీ టైటిల్‌పై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో గాంధీ కుటుంబంలో ఎవరూ నెహ్రూ ఇంటిపేరును ఎందుకు ఉపయోగించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈ ఆరోపణల్లో నిజం ఎంత? అసలు గాంధీ కుటుంబం నిజమైని ఇంటిపేరు ఏమిటి? వంటి సందేహాలు మీకూ వచ్చాయా.. అవేంటో తెలుసుకుందాం..

ఇదీ కాంగ్రెస్‌ నేతల ‘గాంధీ’ రహస్యం

ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ నుంచి గాంధీ ఇంటి పేరు సంప్రదాయంగా నెహ్రూ కుటుంబం అనుసరిస్తోంది. నిజానికి ఫిరోజ్ ఇంటిపేరు గాంధీ కాదు. అతని పుట్టిన పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. అతను బొంబాయి కోటలోని తెహ్ముల్జీ నారిమన్ ఆసుపత్రిలో పార్సీ కుటుంబంలో జన్మించాడు. తర్వాత మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో ఫిరోజ్ స్వాతంత్య్ర పోరాటంలో చేరాడు. అప్పటి నుంచి 

అతను తన ఇంటిపేరు స్పెల్లింగ్‌ను గాంధీగా మార్చుకున్నాడు.

ఇందిరా గాంధీ 19 నవంబర్ 1917న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు, భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. నెహ్రూ కాశ్మీరీ పండిత వర్గానికి చెందినవారు. ఇందిర తన తల్లి కమలా నెహ్రూతో కలిసి అలహాబాద్‌లోని ఆనంద్ భవన్‌లో పెరిగారు. ఆమె తండ్రి నెహ్రూ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.

అలహాబాద్‌లో ఉంటోన్న ఫిరోజ్ గాంధీ 1933లో ఇందిరను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, అప్పటికి ఇందిర వయసు 16 ఏళ్లు మాత్రమే. ఇందిర, ఆమె తల్లి కమలా నెహ్రూ ఫిరోజ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఉన్నప్పుడే ఇందిర ఫిరోజ్‌తో సన్నిహితంగా మెలిగింది. దీంతో వారు మార్చి 1942లో వివాహం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన జొరాస్ట్రియన్ పార్సీ కుటుంబానికి చెందినప్పటికీ, ఫిరోజ్ హిందూ ఆచారాల ప్రకారం ఇందిరను వివాహం చేసుకున్నాడు.

ఇందిరా, ఫిరోజ్‌ల వివాహాన్ని ఇందిర తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ వ్యతిరేకించినట్లు సమాచారం. వారి వివాహాన్ని ఆపేందుకు మహాత్మా గాంధీని కూడా ఆశ్రయించాడట. కానీ, వారి వివాహ విషయంలో మహాత్మా గాంధీ జోక్యం చేసుకోదలచుకోలేదట. దీంతో ఇందిరా నెహ్రూ, ఫిరోజ్ గాంధీల వివాహం అనంతరం ఇందిరా పేరు ఇందిరా గాంధీగా మారింది. వారి కుటుంబాన్ని నెహ్రూ-గాంధీ కుటుంబం అని పిలుస్తారు. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "History of Gandhi family"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0