Indian Coast Guard Navik Recruitment 2023
Indian Coast Guard Navik Recruitment 2023: భారీగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ పోస్టులు.. ఖాళీలు, జీతం వివరాలు. www.joinindiancoastguard.cdac.in
నిరుద్యోగులకుఅలర్ట్. పది, ఇంటర్, డిప్లొమా అర్హతతో భారత రక్షణ రంగంలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వివిధ విభాగాల్లో నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలభర్తీకి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22తో ముగుస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్‌తో కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ)-260 పోస్టులు, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-30 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక యాంత్రిక్(మెకానికల్)-25, యాంత్రిక్(ఎలక్ట్రికల్)-20, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)-15 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 350 ఖాళీలు భర్తీ కానున్నాయి.
వయోపరిమితి
ఇండియన్ కోస్ట్‌గార్డ్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థుల వయసు 18 సి
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్
నావిక్(జనరల్ డ్యూటీ) పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి. నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక యాంత్రిక్ పోస్ట్‌ల కోసం ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్(రేడియో-పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా ఐసీజీ అధికారిక పోర్టల్ www.joinindiancoastguard.cdac.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, కెరీర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్, నావిక్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
- ఆ తరువాత 'అప్లై నౌ' బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అవ్వాలి.
- ఈ ప్రక్రియ ముగిసిన తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అర్హత ఉన్న పోస్ట్‌కు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, చివరగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయండి.
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష. రెండో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. మూడో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా నాలుగో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
జీతభత్యాలు
నావిక్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.21,700 కాగా, యాంత్రిక్ పోస్ట్‌లకు రూ.29,200 లభిస్తుంది.
www.joinindiancoastguard.cdac.in
0 Response to "Indian Coast Guard Navik Recruitment 2023"
Post a Comment