Joint pains Home remedies
మోకాళ్ళ నొప్పులు , కీళ్ల నొప్పులు , నడుము నొప్పి , పాదాల నొప్పులు అన్నీ తగ్గి జీవితంలో ఉండవు
Joint pains Home remedies : మారిన జీవనశైలి కారణంగా, సరైన వ్యాయామం లేకపోవటం,ఎక్కువసేపు కూర్చోవటం వంటి కారణాలతో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,పాదాల నొప్పులు వంటివి వస్తున్నాయి.
వీటిని తగ్గించుకోవటానికి ప్రతి రోజు కొన్ని ఆహారాలను తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఎండుకొబ్బరి కూడా నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే సరిపోతుంది. ఎండు కొబ్బరిలో రాగి, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం సమృద్దిగా ఉంటాయి. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఎండు కొబ్బరిని తురిమి పాలల్లో కలుపుకొని కూడా తాగవచ్చు.
అవ నూనె నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. అవ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే నొప్పులు తగ్గుతాయి. నొప్పులు ఉన్న ప్రదేశంలో రక్త ప్రవాహం మరియు ప్రసరణను పెంచి నొప్పులను తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా నొప్పుల నివారణకు అవ నూనెను వాడతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
0 Response to "Joint pains Home remedies"
Post a Comment