GST on online games from today
నేటి నుంచే ఆన్‌లైన్ గేమ్స్‌పై జీఎస్‌టీ.
- క్యాసినో, గుర్రపు పందేలపై కూడా
- 28% జీఎస్‌టీ వేయనున్న ప్రభుత్వం
ఆన్‌లైన్ గేమ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై వేసిన జీఎస్‌టీ ట్యాక్స్ ఆదివారం నుంచి అమల్లోకి రానుందని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
సెంట్రల్ జీఎస్‌టీ చట్టంలోని సవరణల ప్రకారం, వీటిని లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ల మాదిరే పరిగణించనున్నారు. బెట్స్ ఫుల్ వాల్యూపై 28 శాతం జీఎస్‌టీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐజీఎస్‌టీ సవరణల ప్రకారం, విదేశాల్లో ఉంటూ ఇండియాలో బిజినెస్ చేస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దేశంలోని చట్టాలకు తగ్గట్టు ట్యాక్స్‌లు కట్టాలి. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్ ఈ ఏడాది జులై, ఆగస్టులో వరుస సమావేశాలు నిర్వహించింది. జీఎస్‌టీ చట్టాలకు సవరణలు చేసి ఆన్‌లైన్స్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై ట్యాక్స్‌లు వేసింది. ఈ నిర్ణయాలను అమల్లోకి తేవడానికి కిందటి నెల పార్లమెంట్‌లో జీఎస్టీ సవరణలకు ఆమోదం తెలిపారు.
0 Response to "GST on online games from today"
Post a Comment