Weight Loss Story
Weight Loss Story: ఒకప్పుడు 133 కేజీల బరువు.. 5 నెలల్లోనే అనూహ్య మార్పు.. ఏకంగా 48 కేజీల బరువు ఎలా తగ్గాడంట
భారీగా పెరిగిన శరీరాన్ని మోయలేక పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. శరీరం బరువు పెరిగే కొద్దీ అన్నీ బాధలే. నచ్చిన దుస్తులు వేసుకోలేకపోవడం నుంచి చురుగ్గా కదలలేకపోవడం, నలుగురిలో కలవలేకపోవడం వంటి చాలా ఇబ్బందులు మొదలవుతాయి.
అంతే కాదు భారీగా పెరిగిన శరీరంతో వయసుకు మించి కనిపిస్తారు. ఓ కుర్రాడు ఇవన్నీ చూసి విసిగిపోయి అందులోంచి బయట పడాలని విశ్వప్రయత్నం చేసాడు. ఇక విజయాన్ని అతగాడు ఎలా అందుకున్నాడన్నదే ఆసక్తికరమైన విషయం.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివసిస్తున్న 28 ఏళ్ల సార్థక్ అనీజా ఒకప్పుడు 133.3 కిలోల బరువుండేవాడు. పెరుగుతున్న స్థూలకాయం కారణంగా, అతను నీరసంగా, త్వరగా అలసిపోవడం, స్థూలకాయం కారణంగా నచ్చిన దుస్తులు సరిగ్గా సరిపోవడం లేదని, తన సైజులో ఉన్న దుస్తులను వెతకడమే అతిపెద్ద సవాలుగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా ఓ రోజు ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన, సార్థక్ అనీజా తన ఫొటోలు చూసి ఇక బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు.
పేరు: సార్థక్ అనీజా
వృత్తి: CA
వయస్సు: 28
ఎత్తు: 5.11 అడుగులు
నగరం: నోయిడా
బరువు పెరిగింది: 133.3 కిలోలు
తగ్గిన బరువు ఎంత సమయంలో : 48 కిలోలు, 5 నెలలు
దీనికోసం సార్థక్ అనీజా జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకున్నాడు?
నామమాత్రంగా ఉపవాసం
సాయంత్రం 6:30 నుంచి 7 తర్వాత భోజనం చేయకూడదు.
అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం
కోరికలను అధిగమించడం
ఆహార భాగాలను నియంత్రించడం
సార్థక్ అనీజా డైట్ ప్లాన్ ఇలా ఉండేది.
అల్పాహారం: ఉసిరి అలోవెరా జ్యూస్, 4 బాదం, 4 ఎండుద్రాక్ష, 2 వాల్‌నట్స్, 1 స్కూప్ ప్రోటీన్ షేక్
మధ్యాహ్న భోజనం: మజ్జిగ లేదా పుచ్చకాయ రసంతో చికెన్ సలాడ్
రాత్రి భోజనం: ఆమ్లెట్, ఉడికించిన గుడ్లు (సాయంత్రం 6:30 తర్వాత తినే కార్యక్రమం ఉండేది కాదు)
వ్యాయామానికి ముందు భోజనం: ఉపవాస సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సార్థక్ అనీజా ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేసేవాడు. చీట్ డేస్‌లో బటర్ చికెన్, పిజ్జా, మోమో, చీజ్‌కేక్
తక్కువ కేలరీల భోజనం : 200 గ్రా చికెన్ బ్రెస్ట్ సలాడ్, తక్కువ కొవ్వు సాస్‌లను డ్రెస్సింగ్‌గా ఉపయోగించడం (పెరి పెరి, బార్బెక్యూ, సీజర్)
ఫిట్‌నెస్ సీక్రెట్స్: అడపాదడపా ఉపవాసం, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం
వర్కవుట్ రొటీన్ ఇలా ఉండేది.
1 గంట కార్డియో (ఎక్కువగా ట్రెడ్‌మిల్, సైక్లింగ్) 1 గంట బరువు శిక్షణ.. వారంలో చివరి రోజు బ్యాడ్మింటన్ లేదా క్రికెట్ ఆడటం
ఉత్సాహంగా ఉంచుకోవడం ఎలా?
ఎప్పుడు వర్కవుట్ చేయడం ప్రారంభించాడో ఆ ఫోటోలను క్రమం తప్పకుండా చూస్తూ ఉండేవాడు సార్థక్ అనీజా. మళ్లీ అలాంటి వ్యక్తిగా ఉండకూడదని తనని తాను ప్రేరేపించుకునేవాడు. ఇప్పుడు నచ్చిన దుస్తులు అతనికి సరిగ్గా సరిపోతాయి.
బరువు తగ్గడం నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
బరువు తగ్గాలంటే కష్టపడి పనిచేయడం ముఖ్యం. మనం తరచుగా ఒక సంవత్సరంలో ఏమి సాధించగలమో తక్కువ అంచనా వేయము కానీ.. 10 సంవత్సరాలలో ఏమి సాధించగలము. అని అతిగా అంచనా వేస్తూ ఉంటాం. నిజానికి చాలా తక్కువ సమయంలో చాలా చేయచ్చు. దానికి నా శరీరం అధిక బరువును తగ్గడమే సాక్ష్యం అన్నాడు సార్థక్ అనీజా.
0 Response to "Weight Loss Story"
Post a Comment