Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All India Sainik Schools Entrance Examination(AISSEE) -2024

AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

All India Sainik Schools Entrance Examination(AISSEE) -2024


త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. సంపూర్ణ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను పాఠశాల దశ నుంచే నేర్పిస్తారు. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.

పరీక్ష వివరాలు.

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024

సీట్ల కేటాయింపు: ఆరో తరగతి(ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం(ఎస్పీఎస్సార్‌ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.

అర్హతలు:

ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

పరీక్ష విధానం: పెన్ పేపర్ (ఓఎంఆర్‌ షీట్‌) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 

ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు.

తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్  నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్ష కాల వ్యవధి ఉంటుంది.

Utతొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.

సీట్ల కేటాయింపు: ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు లేదు.

పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా 186 కేంద్రాల(దాదాపు అన్ని సైనిక స్కూళ్లు)లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.

దరఖాస్తు విధానం: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 7, 2023 నుంచి డిసెంబర్‌ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.


WEBSITE HERE


APPLY HERE


NOTIFICATION HERE


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All India Sainik Schools Entrance Examination(AISSEE) -2024 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0