AP DWCWE Jobs
AP DWCWE Jobs: ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆయా జిల్లాల్లోని మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
ఈ నోటిఫికేషన్ల కిద జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, నర్సు, డాక్టర్, ఆయా, చౌకీదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, వంటి తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏడు, పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ.. అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 42 ఏళ్లు మించకూడా ఉండాలి. నింపిన దరఖాస్తులను ఆయా జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం చిరునామాకు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.
ప్రకాశం జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ పోస్టులు
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ (మేల్), డేటా అనలిస్ట్, అవుట్‌రీచ్ వర్కర్ (మహిళ), నర్సు, డాక్టర్ (పార్ట్ టైమ్), చౌకీదార్(మహిళ), డేటా ఎంట్రే ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుకు నవంబర్ 22, 2023 చివరితేదీ.
పార్వతీపురం మన్యం జిల్లాలో పోస్టులు
ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, ఔట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళ), నర్సు(మహిళ), సోషల్ వర్కల్ కం ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ), డాక్టర్ (పార్ట్ టైమ్), ఆయా(మహిళ), చౌకీదార్(మహిళ), అధికారి-ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్), స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్, హౌస్ కీపర్.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు నవంబర్ 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వైఎస్సార్ జిల్లాలో ఖాళీల వివరాలు.
ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్) పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏలూరు జిల్లాలో ఖాళీల వివరాలు
జిల్లా కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు నవంబర్ 14, 2023వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంఓల దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీలు.
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు), సోషల్ వర్కర్, నర్సు, డాక్టర్ (పార్ట్ టైమ్), ఆయా, చౌకీదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, కుక్, హెల్పర్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివరి తేదీ నవంబర్ 11, 2023.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఖాళీలు
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు), సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు), నర్సు(మహిళలు), డాక్టర్ (పార్ట్ టైమ్), అయా(మహిళలు), చౌకీదార్(మహిళలు).. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివరి తేదీ నవంబర్ 16, 2023.
అన్నమయ్య జిల్లాలో ఖాళీలు.
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/ కోఆర్డినేటర్(ఫిమేల్), సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్(ఫిమేల్), నర్సు(ఫిమేల్), డాక్టర్ (పార్ట్ టైమ్), అయా(ఫిమేల్), చౌకీదార్.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివరి తేదీ నవంబర్ 20, 2023.
తిరుపతి జిల్లాలో ఖాళీలు.
జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
0 Response to "AP DWCWE Jobs"
Post a Comment