Child Care Tips
Child Care Tips: మీ పిల్లలు హైట్ పెరగాలనుకుంటున్నారా.. అయితే వీటిని తినిపించండి.
పిల్లల ప్రతి విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం, బట్టలు ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది.
అయితే కొంత మంది పిల్లలు హెల్దీ ఫుడ్ తిన్నా సరైన హైట్ పెరగరు. దీంతో పేరెంట్స్ చాలా బాధ పడుతూంటారు. అయితే పిల్లల పొడవు.. వారి తల్లిదండ్రుల పొడవుపై కూడా ఆధార పడి ఉంటుంది. కానీ కొన్ని రకాల ఆహారాలను పిల్లలకు పెడితే వారు హైట్ బాగా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ రకమైన ఆహారాలను అందజేస్తే.. వారి ఎత్తూ, ఆరోగ్యం రెండూ బాగుంటాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాల ఉత్పత్తులు:
పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పాల ఉత్పత్తులు మంచి పాత్ర పోషిస్తాయి. పెరుగు, జున్ను, చీజ్, పాలు అలాంటివి తినిపిస్తే.. వారికి మంచి పోషకాలు అందుతాయి. వీటిల్లో విటమిన్ ఏ, బి, డి, ఇ, ప్రోటీన్స్, క్యాల్షియం, వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల హైట్ ని పెంచేందుకు సహాయ పడతాయి. ముఖ్యంగా విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు చేర్చితే పిల్లలు బలంగా, దృఢంగా ఉంటారు.
గుడ్లు:
వయసుతో, రోజుతో సంబంధం లేకుండా అందరూ ప్రతి రోజూ తినాల్సిన ఆహారం కోడి గుడ్లు. రోజూ ఒక కోడి గుడ్డు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ఎందుకంటే గుడ్లలో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారు పొడుగ్గా, బలంగా తయారవుతారు. కాబట్టి పిల్లల డైట్ లో ఇది ఖచ్చితంగా ఉండేలా చూడండి.
అరటి పండ్లు:
అరటి పండ్లలో క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫైబర్, విటమిన్స్ వంటివి అన్నీ ఉంటాయి. అరటి పండును ప్రతి రోజూ పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లలు బలంగా ఉంటారు. అదే విధంగా హైట్ పెరిగే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్షణమే ఎనర్జీ లెవల్స్ ని అందిస్తుంది అరటి పండు. కాబట్టి ప్రతి రోజూ ఖచ్చితంగా అరటి పండును పిల్లలకు ఇవ్వండి.
చేపలు:
చేపల్లో క్యాల్షియం, భాస్వరం, ఐరన్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్చ సెలీనియం వంటి పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి పిల్ల ఎదుగుదలకు సహాయ పడతాయి.
ఆకు కూరలు:
పిల్లలకు ఆకు కూరలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆకు కూరల్లో విటమిన్లు ఏ, సి, కే, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఆకు కూరలు పిల్లలకు ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా హైట్ ఎదుగుతారు.
0 Response to "Child Care Tips"
Post a Comment