Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know how many diseases pomegranate can prevent! An explanation of what the studies say.

 దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్‌పెడుతుందో తెలుసా! అధ్యయనాలు ఏం చెబుతున్నాయో వివరణ.

Do you know how many diseases pomegranate can prevent! An explanation of what the studies say.

దానిమ్మ పండు, పువ్వులు, బెరడు, వేర్లు ఆకులు అనేక వ్యాధులు చికిత్స చేయడానికి ఉపయోగించేలా పాలీఫెనాల్స్ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్ని కావు.

ఇది జీర్ణ రుగ్మతలు, చర్మ రుగ్మతలు, పేగు సంబధింత వ్యాధులకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద డైటిషన్‌ శిరీష రాకోటి. ఈ పండును తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి రావో డైటిషన్‌ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందామా!.


ఇందులో వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఒక పోషకమైన పండు దానిమ్మ. ఈ పండ్లను తీసుకోవడం ఏఏ వ్యాధులు దరిదాపుల్లోకి రావంటే..


దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ ప్యూనికాలాగిన్స్ ఎలాజిక్ యాసిడ్ వంటి పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మీ శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు.

రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యేలా చేస్తుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

దానిమ్మ రసం తీసుకోవడం వల్ల వృద్ధులలో జ్ఞాపకశక్తి పెరిగేలా మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి.

క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంది. అంతేగాదు కొన్ని అధ్యయనాలు దానిమ్మ సారం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని సూచించాయి, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంమీద, దానిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఆఖరికి వంధ్యత్వాన్ని నయం చేయడానికి కొన్ని దేశాల్లో దానిమ్మపండ్ల రసాన్ని ఉపయోగిస్తారని అధ్యయనాలు తెలిపాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know how many diseases pomegranate can prevent! An explanation of what the studies say."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0