Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How To Update Aadhaar Card Online In Telugu

 10 ఏళ్లుగా ఆధార్​​ అప్డేట్​ చేయలేదా? ఆన్​లైన్​లో ఫ్రీగా వివరాలు మార్చుకొనే విధానం.

How To Update Aadhaar Card Online In Telugu

How To Update Aadhaar Card Online In Telugu : 10 ఏళ్లుగా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్​ చేసుకోనివారి కోసం మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికీ ఆధార్​లో తమ వ్యక్తిగత వివరాలు మార్చుకోనివారు డిసెంబర్​ 14లోపు ఆన్​లైన్​లో ఉచితంగా మార్చుకోవచ్చు. మరి ఆన్​లైన్​లో ఫ్రీగా ఆధార్​ కార్డ్​ను ఎలా​ అప్డేట్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Update Aadhaar Card Online : ఆధార్​ కార్డ్​ తీసుకొని 10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ సమయం గడిచిందా? అయినా ఇంకా ఆధార్​ వివరాలను అప్డేట్​ చేయలేదా? అలాంటివారి కోసమే ఇంకో అవకాశం ఇచ్చింది భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI). ఇంతకు ముందు ఆధార్​ అప్డేట్​ కోసం రూ.50 రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఎవరైతే తమ ఆధార్ వివరాలను అప్డేట్​ చేసుకోలేదో.. వారు డిసెంబర్​ 14లోపు ఆన్​లైన్​లో ఫ్రీగా సదరు వివరాలను మార్చుకోవచ్చు. అందుకే ఆన్​లైన్​లో ఉచితంగా ఆధార్​ కార్డ్​ను ఎలా అప్డేట్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమేమి మార్చుకోవచ్చు.?

Aadhaar update Details : ఫొటో, వేలిముద్రలు, ఐరిస్​, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా, మొబైల్​ నంబర్​, ఇంటి పేరు, లింగం సహా ఇతర వివరాలను బయోమెట్రిక్ ద్వారా అప్డేట్​ చేసుకోవచ్చు. అయితే ఫొటోగ్రాఫ్​, ఐరిస్​ లాంటి బయోమెట్రిక్స్ అప్​డేట్ చేసుకోవడానికి దగ్గరల్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించి, అందుకు తగ్గ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఫింగర్ ప్రింట్స్​, ఐరిస్ లాంటి బయోమెట్రిక్స్​ సేకరించేందుకు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు బయోమెట్రిక్స్ నమోదులో ఎలాంటి మోసాలు​ జరగకుండా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటికి కొంత ఖర్చు అవుతుంది. అందుకే అందుకు తగిన రుసుమును ఆధార్ కేంద్రాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ అప్డేట్​ ఎందుకు అవసరం?

Why Aadhaar Update Is Mandatory : UIDAI నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. దీని వల్ల వ్యక్తుల డేటా అక్యురేట్​గా, అప్​-టు-డేట్​గా ఉంటుంది.

సాధారణంగా భారతదేశంలో అమ్మాయిలకు పెళ్లి అయిన తరువాత వారి చిరునామా, ఇంటి పేర్లు మారుతూ ఉంటాయి. కొందరు ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి తరలివెళ్తుంటారు. ఇలాంటి వారందరూ తమ ఆధార్​ వివరాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు మన ఫోన్ నంబర్​, ఈ-మెయిల్స్ కూడా మారుస్తూ ఉంటాం. కనుక ఆ వివరాలను సైతం ఆధార్​లో అప్​డేట్ చేయాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​లో ఆధార్​ కార్డ్ అప్డేట్​ ఇలా.

How To Update Aadhaar Card Online :

  • ముందుగా మీరు UIDAI వెబ్​సైట్​ uidai.gov.in లోకి లాగిన్​ అవ్వండి.
  • రిజిస్ట్రేషన్​ కోసం లాగిన్​ ఐడీ, పాస్​వర్డ్​ను క్రియేట్​ చేసుకోండి.
  • తరువాత 'My Aadhaar' ట్యాబ్​పై క్లిక్​ చేసి 'Update Your Aadhaar' ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోండి.
  • ఇప్పుడు మీ ఆధార్​ సంఖ్యను ఎంటర్​ చేయండి. దీంతో పాటు వెరిఫికేషన్​ కోసం బాక్స్​లో చూపించే Captcha కోడ్​ను టైప్​ చేయండి. అంతరం 'Send OTP'పై క్లిక్​ చేయండి.
  • మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీ సంఖ్యను ఎంటర్​ చేసి 'Login' అవ్వండి.
  • ఇప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటున్న వివరాలను.. ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేసి Submit బటన్​ను నొక్కండి.
  • మీరు అప్డేట్​ చేయాలనుకుంటున్న వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్​ను స్కాన్​ చేసి అప్​లోడ్​ చేయండి.
  • ప్రక్రియను పూర్తి చేసేందుకు 'Submit Update Request'పై క్లిక్​ చేయండి.
  • అనంతరం మీ మొబైల్​కు 'Update Request Number' (URN) వివరాలు మెసేజ్​ రూపంలో వస్తాయి. ఆ URNను జాగ్రత్తగా నోట్​ చేసుకోండి. మీ అప్డేట్​ స్టేటస్​ను​ ట్రాక్​ చేసేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది.
  • మీ అప్డేట్​ రిక్వెస్ట్​కి సంబంధించిన స్టేటస్​ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకోసం myaadhaar.uidai.gov.in/సైట్​ను వీక్షించవచ్చు.
  • ఇందులోకి లాగిన్​ అయిన తర్వాత 'Check Enrolment & Update Status' సెక్షన్​లో మీ మొబైల్​ నంబర్​కు వచ్చిన URN నంబర్​ను ఎంటర్​ చేయండి.
  • ఇక్కడ మీ అభ్యర్థనకు సంబంధించిన స్టేటస్​ వివరాలను తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How To Update Aadhaar Card Online In Telugu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0