Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NTR GEST Scholarship 2024

 ఇంటర్​ స్టూడెంట్స్​కు ప్రతి నెలా రూ.5వేలు స్కాలర్​షిప్​- అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు.

NTR GEST Scholarship 2024

NTR GEST Scholarship 2024 : ప్రతిభగల విద్యార్థినులకు శుభవార్త. ఎన్​టీఆర్ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (GEST-2024)ను డిసెంబర్‌ 17న జరగనుంది.

మరి ఈ టెస్ట్ రాయాలంటే అర్హతలేంటో? అప్లైకు ఆఖరి తేదీ ఎప్పుడో? స్కాలర్​షిప్ ఎంతో? తెలుసుకుందామా మరి.

NTR GEST Scholarship 2024 : ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (GEST-2024) తేదీ ఖరారైంది. డిసెంబర్‌ 17న ఈ స్కాలర్​షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎన్​టీఆర్ ట్రస్ట్ ప్రకటించింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షలో మొదటి 25 స్థానాల్లో నిలిచిన బాలికలకు ఉపకారవేతనం అందించనున్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున.. ఎన్​టీఆర్ బాలికల జూనియర్‌ కళాశాలలో రెండేళ్ల ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నారు.

ఎన్టీఆర్‌ జీఈఎస్‌టీ (గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్)-2024

NTR GEST Scholarship 2024 Eligibility Criteria :

అర్హతలు: పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు అర్హులు

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పరీక్ష కాలవ్యవధి : 2 గంటలు.

సిలబస్​ : మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్​, పదో తరగతి స్థాయి రీజనింగ్.

NTR GEST Scholarship 2024 Apply Online :

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 డిసెంబర్ 15. ఎన్​టీఆర్ ట్రస్ట్ వెబ్​సైట్​ ( https://ntrtrust.org/ntr-gest-scholarship/ )లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ: 2023 డిసెంబర్ 17 (ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు)

అభ్యర్థులు తమ వెంట తీసుకురావాల్సినవి :

రెండు పాస్​పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్​, పాడ్​, స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు, మాస్క్​, శానిటైజర్​

పరీక్ష ఫీజు : 200 రూపాయలు

NTR GEST Scholarship 2024 Hall Ticket Download :

హాల్​టికెట్లు డౌన్​లోడ్​ :

అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో 2023 డిసెంబర్ 15 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫలితాలు :

ఎంపికైన అభ్యర్థుల జాబితా www.ntrtrust.org వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. పరీక్ష తేదీ నుంచి ఒక వారంలోపు ఫలితాలను ప్రకటిస్తారు.

ఎగ్జామ్ సెంటర్​ :

ఎన్​టీఆర్ జూనియర్ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NTR GEST Scholarship 2024 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0