Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Annuity Deposit Scheme

 SBI Annuity Deposit Scheme: బ్యాంకుకూ మీరు అప్పు ఇవ్వొచ్చు! నెలానెలా వడ్డీతో పాటు అసలు కూడా తిరిగి ఇచ్చేస్తుంది.. అదెలాగో వివరణ.

SBI Annuity Deposit Scheme

మీరు ఒకసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసి.. నెలనెలా ఆదాయం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే బెస్ట్ స్కీమ్. దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అద్బుతమైన పథకాన్ని అందిస్తోంది.

ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసి, నెల నెలా ఆదాయాన్ని పొందొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

చాలా మంది తమ ఆర్థిక వనరులపై పక్కా ప్రణాళికతో వెళ్తారు. పెద్ద మొత్తంలో డబ్బు పోగేసి. బయట వడ్డీలకు తిప్పుతారు. దాని ద్వారా నెలనెలా వడ్డీలు వసూలు చేస్తే ఆదాయం వస్తుందని భావిస్తారు. అయితే అవి అంత సురక్షితం కాదు. అదే బ్యాంకులో అయితే మీకు భద్రత భరోసా ఉంటుంది. అందుకోసం ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్లో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తారు. దానిపై బ్యాంకు మీకు వడ్డీ కూడా ఇస్తుంది. ఆ వడ్డీతో పాటు అసలులోని కొంత మొత్తాన్ని నెలనెలా మీకు అందిస్తుంటుంది. అంటే ఇది ఒకరకంగా మీరు బ్యాంకుకు అప్పు ఇచ్చినట్లు లెక్క. భారతీయ పౌరుల ఎవరైనా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. మైనర్లకు కూడా అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ కేటగిరీ వారు కూడా దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు.

ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ ప్రధానాంశాలు.

ఈ పథకంలో 36/60/84/120 నెలల కాలపరిమితితో డిపాజిట్ చేయొచ్చు.

కనీస నెలవారీ ఆదాయం రూ. 1,000 వచ్చేటట్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అయితే, రూ. 15,00,000 వరకు డిపాజిట్లపై ముందస్తు చెల్లింపు చేయవచ్చు.

డిపాజిట్ మొత్తానికి గరిష్ట పరిమితి లేదు.

డిపాజిటర్ కొన్ని సందర్భాల్లో మొత్తం యాన్యుటీ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు ఓవర్‌డ్రాఫ్ట్ లేదా లోన్ తీసుకునే సౌకర్యాన్ని పొందుతాడు.

డిపాజిటర్ మరణించిన సందర్భంలో, ముందస్తు చెల్లింపు చేయవచ్చు, దానిపై పరిమితి ఉండదు.

ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేటు.

ఈ పథకంపై వడ్డీ రేటు టర్మ్ డిపాజిట్లపై పొందే వడ్డీ రేటుతో సమానంగా ఉంటుంది. ఎస్‌బీఐ తాజాగా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. సాధారణ ఇన్వెస్టర్లకు 6.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో, డిపాజిట్‌లను నాలుగు కాల వ్యవధిలో చేయవచ్చు. కాబట్టి వేర్వేరు కాలవ్యవధులపై వేర్వేరు వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా భిన్నంగా.

యాన్యుటీ డిపాజిట్ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లాగా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. డిపాజిటర్ ఎఫ్డీ ఖాతాలో ఒకసారి డబ్బును డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ తర్వాత అసలు, వడ్డీ మొత్తాన్ని ఒకేసారి పొందాలి. అయితే, యాన్యుటీ డిపాజిట్‌లో మీరు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు నిర్ణయించిన కాల వ్యవధిలో బ్యాంక్ మీకు తిరిగి చెల్లిస్తుంది. అసలు, వడ్డీ కలిపి మీకు వాయిదాల రూపంలో ఇస్తుంది. అంటే, ఈ స్కీమ్లో మీరు చేసే వన్‌టైమ్ పేమెంట్‌పై, బ్యాంక్ మీకు ప్రతి నెల ఈఎంఐ రూపంపలో తిరిగి ఇస్తుంది. దీని కారణంగా, మీ ప్రధాన మొత్తం తగ్గుతూ ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి మీ మొత్తం సున్నా అవుతుంది.

ఈ ఉదాహరణ చూడగలరు

ఒక డిపాజిటర్ రూ. 5లక్షలను ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్లో పెట్టుబడి పెట్టాడనుకుందాం. అది కూడా ఐదేళ్ల కాలపరిమితితో పెట్టాడనుకుందాం. వడ్డీ రేటు ఉదాహరణకు 6.5శాతం అనుకుంటే డిపాజిటర్ కు నెలనెలా రూ. 9,750 స్థిరమైన ఆదాయం వస్తుంది. దీనిలో రూ. 2,710 వడ్డీ కాగా, మిగిలినది అసలు నుంచి ఇస్తారు. ఇలా ప్రతి నెలా మీరు పెట్టుకున్న కాలపరిమితి ఐదేళ్ల వరకూ ఇస్తారు. చివరికి మీ సొమ్ము మొత్తం వడ్డీ తో కలిపి ఇచ్చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Annuity Deposit Scheme"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0