Voter List: Is your name in the voter list?
Voter List: ఓటర్ల జాబితాలో మీ పేరుందా?
ఉంటుందిలే అనే భరోసా వద్దు. వెంటనే తనిఖీ చేసుకోండి
రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ముఖ్యమైన ఎన్నికలు.
ప్రతి ఓటూ కీలకమే. ఎవరికివారు ఓటర్ల జాబితాలో తమ పేరుందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఏ మాత్రం అలక్ష్యంగా ఉన్న రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వెంటనే ఓటర్ల జాబితాను పరిశీలించుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో అందులో మీ పేరుందో.. లేదో పరిశీలించేందుకు ఉన్న మార్గాలివి.
ఓటు పరిశీలనకు జిల్లాలోని కాల్ సెంటర్
ఓటరు జాబితాలో తమ ఓటును పరిశీలించుకునేందుకు చేతిలో మొబైల్ ఉండి నెట్ లేకపోయినా ఫర్వాలేదు. నేరుగా కాల్‌సెంటర్‌కు కాల్ చేస్తే చాలు వారు లైన్‌లో ఉంచి జాబితాలో పేరు ఉన్నదీ లేనిదీ చెప్పేస్తారు. 1950కి కాల్ చేస్తే జిల్లాలోని ఎన్నికల విభాగంలోని కాల్ సెంటర్‌కు వెళుతుంది. వారికి పేరు, నియోజకవర్గం చెబితే చాలు జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ తెలియజేయడంతో పాటు ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, బూత్ నంబరు కూడా తెలియజేస్తారు.
పేరు లేకపోతే ఏం చేయాలి?
ఓటర్ల జాబితాలో పేరు లేదని గుర్తిస్తే ఓటరుగా నమోదు కోసం వెంటనే ఫారం-6 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో లేదా నేరుగా సమర్పించాలి. వాటి ఆధారంగా 2024 జనవరి 5న తుది జాబితా విడుదల చేసేనాటికి మీ పేరు జాబితాలో చేరేందుకు వీలుంటుంది.
'డ్రాఫ్ట్ ఎస్‌ఎస్‌ఆర్ ఈ రోల్-2024' అనే విభాగంలోకి ప్రవేశించి.
మార్గం-1: https:eoandhra.nic.in వెబ్‌సైట్‌లోకి పై భాగంలో ''పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్'' అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ''అసెంబ్లీ నియోజకవర్గాలు'' అనే విభాగంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాత ''డ్రాఫ్ట్ ఎస్‌ఎస్‌ఆర్ ఈ రోల్-2024'' అనే ఉపవిభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితాలు పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉంటాయి. మీరు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో ఆ ఓటర్ల జాబితా పరిశీలించి మీ పేరుందో లేదో చూసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లోనే పైభాగంలో 'సెర్చ్ యువర్ నేమ్' అనే ఉప విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌చేసి కూడా జాబితాలో పేరుందా? లేదా? తెలుసుకోవచ్చు.
'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్'లో చూడాలి
మార్గం-2: https://voterportal.eci.gov.in , www.nvsp.in వెబ్‌సైట్‌లో ఏదైనా ఓపెన్ చేయగానే... 'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్' అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 'సెర్చ్ బై డీటెయిల్స్', 'సెర్చ్ బై ఎపిక్', 'సెర్చ్ బై మొబైల్' అనే మూడు ఉప విభాగాలు ఉంటాయి.
'సెర్చ్ బై డిటెయిల్స్'లోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం, వయసు నమోదుచేస్తే జాబితాలో మీ పేరుందో లేదో పరిశీలించొచ్చు.
'సెర్చ్ బై ఎపిక్'లోకి వెళ్లి మీ ఓటరు గుర్తింపుకార్డు సంఖ్యను పొందుపరిస్తే పోలింగ్ కేద్రం, సీరియల్ నంబర్ లాంటి వివరాలన్నీ వస్తాయి.
'సెర్చ్ బై మొబైల్'లో మీ ఫోన్‌నంబర్ పొందుపరిస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదుచేసి మీ ఓటును తనిఖీచేసుకోవచ్చు.
మార్గం-2: https://voterportal.eci.gov.in , www.nvsp.in వెబ్‌సైట్‌లో ఏదైనా ఓపెన్ చేయగానే... 'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్' అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 'సెర్చ్ బై డీటెయిల్స్', 'సెర్చ్ బై ఎపిక్', 'సెర్చ్ బై మొబైల్' అనే మూడు ఉప విభాగాలు ఉంటాయి.
'సెర్చ్ బై డిటెయిల్స్'లోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం, వయసు నమోదుచేస్తే జాబితాలో మీ పేరుందో లేదో పరిశీలించొచ్చు.
'సెర్చ్ బై ఎపిక్'లోకి వెళ్లి మీ ఓటరు గుర్తింపుకార్డు సంఖ్యను పొందుపరిస్తే పోలింగ్ కేద్రం, సీరియల్ నంబర్ లాంటి వివరాలన్నీ వస్తాయి.
'సెర్చ్ బై మొబైల్'లో మీ ఫోన్‌నంబర్ పొందుపరిస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదుచేసి మీ ఓటును తనిఖీచేసుకోవచ్చు.
ఓటరు హెల్ప్‌లైన్ యాప్ వరం.
మార్గం-3: గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్నికల సంఘానికి సంబంధించిన VoterHelpline అనే మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ కావాలి. యాప్‌లోకి ప్రవేశిస్తే, పై భాగంలో 'సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్' అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే 'సెర్చ్ బై బార్‌కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డిటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్' అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి. వీటిలో మొదటి రెండు విభాగాలకు మీ ఓటరు గుర్తింపుకార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను, లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేస్తే ఓటరు జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు. మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచటం ద్వారా లేదా ఓటరు గుర్తింపుకార్డు సంఖ్య పొందుపరచటం ద్వారా కూడా జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రాల వద్ద చూడొచ్చు
మార్గం-4: ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్‌స్థాయి అధికారి (బీఎల్వో) ఉంటారు. వారివద్ద ఆ కేంద్రం ఓటర్ల జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించొచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించే ఓటర్ల జాబితాలోనూ పరిశీలించుకోవచ్చు.
0 Response to "Voter List: Is your name in the voter list?"
Post a Comment