APPSC Notification 2023
APPSC Notification 2023:నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను చెప్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది..ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు.
331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి.
పరీక్షా విధానం..
ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్-1, పేపర్-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి..
ఎంపిక ప్రక్రియ.
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.
81 గ్రూప్-1 పోస్టులు.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ ప్రకటన జారీ చేసింది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో మార్చి 17వ తేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.. ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను www.psc.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు..
0 Response to "APPSC Notification 2023"
Post a Comment