Are you using phone pay.. this good news is for you.. new services for free
Phonepe : ఫోన్ పే వాడుతున్నారా .. ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఫ్రీగా కొత్త సర్వీస్ లు
ప్రస్తుతం చాలామంది డిజిటల్ పేమెంట్ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇక ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను యూజర్లకు అందిస్తోంది.
తాజాగా ‘ ఈ – అప్లికేషన్ క్రెడిట్ ‘ కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఫోన్ పే యాప్ లో క్రెడిట్ కి సంబంధించిన అన్ని సర్వీసులను పొందవచ్చు. తాజాగా ఈ సెక్షన్ యూజర్లకు అందుబాటులోకి రావడం మొదలైందని ఫోన్ పే ప్రకటించింది. దీనిని యాక్సెస్ చేయడానికి ముందుగా గూగుల్ పే లేదా ఆపిల్ స్టోర్ కి వెళ్లి ఫోన్ పే యాప్ ను అప్డేట్ చేసుకోవాలి. దీని ద్వారా క్రెడిట్ బ్యూరో స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో యూజర్లకు మరెన్నో లాభాలు ఉన్నాయి. క్రెడిట్ సెక్షన్ లో క్రెడిట్ స్కోర్ లను చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులో లోన్ లను మేనేజ్ చేయడానికి కొత్త లోన్ ఆప్షన్స్ యాక్సెస్ చేయవచ్చు.
యూజర్లు సిబిల్ స్కోర్ క్రెడిట్ సెక్షన్ నుంచి ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. ఎంత క్రెడిట్ ని ఉపయోగించారు, ఎంతకాలం క్రెడిట్ ని కలిగి ఉన్నారు, ఎంత సమయానికి బిల్లులు చెల్లించారు వంటి హిస్టరీ సమ్మరీని పొందవచ్చు. మొత్తం మీద ఇది క్రెడిట్ ని ఎలా మెరుగుపరచాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే దీని ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు ఈఎంఐ లోన్ లను ఫోన్ పే యాప్ నుంచి ఈజీగా చెల్లించవచ్చు. అనేక యాప్లు వెబ్సైట్లో మధ్య మారాల్సిన అవసరం లేదు. యూజర్లు క్రెడిట్, రూపే కార్డులను యాప్ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు డ్యూ పేమెంట్స్ కోసం అలౌడ్స్ రిమైండర్ లను పొందవచ్చు.
ఫోన్ పే అప్డేట్ చేశాక యాప్ ను ఓపెన్ చేసి హోం స్క్రీన్ లో యాప్ బాటం బార్ లో కొత్త క్రెడిట్ బటన్ కోసం చూడాలి. క్రెడిట్ సెక్షన్ పై టాప్ చేసి దానిని ఓపెన్ చేస్తే క్రెడిట్ పేజీలో టాప్ సెక్షన్ లో క్రెడిట్ స్కోర్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో చెక్ నౌ బటన్ పై క్లిక్ చేస్తే ప్రస్తుత క్రెడిట్ స్కోర్ చేసుకోవచ్చు. క్రెడిట్ రూపే కార్డు లను లింక్ చేయడానికి క్రెడిట్ పేజీలోనే కనిపించే మేనేజ్ క్రెడిట్ సెక్షన్ పై నొక్కితే క్రెడిట్ ప్రొఫైల్స్ మేనేజ్ డ్యూస్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే ఆయా వివరాలను పొందవచ్చు. ఈ సెక్షన్ ఇంకా రాకపోతే కొద్ది రోజులు చూడాలి. తరుచుగా ఫోన్ పైన అప్డేట్ చేస్తుండాలి. ఈ ఫోన్ పే భవిష్యత్తులో కన్జ్యూమర్ లోన్స్ వంటి మరిన్ని క్రెడిట్ ప్రొడక్ట్స్ పరిచయం చేయాలని చూస్తోంది. కంపెనీ యూజర్లకు లెండింగ్ పార్ట్నర్స్ తో కలిపి అఫిడబుల్ రెస్పాన్సిబుల్ ఎండింగ్ సర్వీసెస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
0 Response to "Are you using phone pay.. this good news is for you.. new services for free"
Post a Comment