Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government Jobs in Own Mandals" 1,896 Jobs in Village Secretariats

 Govt Jobs: ఏపీ గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాలు.పరీక్ష సరళి మరియు పూర్తి వివరాలు.

Government Jobs in Own Mandals" 1,896 Jobs in Village Secretariats

ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపి కబురు! పశుసంవర్ధక, డెయిరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి స్వాగతం. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో 1896 పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగ వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలను ఏపీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేసింది.మొత్తం 1,896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Pay Scale:  రూ.22,460-రూ.72,810

మొత్తం  పోస్ట్‌లు 1896

ఏపీ గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో కలిపి జిల్లాల వారీగా మొత్తం 1,896 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు

డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్ అనుబంధ సబ్జెక్టుల్లో వొకేషనల్ ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

విధానము

పశుసంవర్ధక పోస్టులకు మొదటి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితా విడుదల చేయబడుతుంది. ఆ తర్వాత జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు.

వెయిటేజీ మార్కులు

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వారికి వెయిటేజీ మార్కులను కూడా కేటాయిస్తారు. గోపాలమిత్ర, గోపాలమిత్ర సూపర్‌వైజర్లు, 1962 పశువైద్యులు, ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒకటిన్నర మార్కుల చొప్పున గరిష్టంగా 15 మార్కులు కేటాయిస్తారు.

రాత పరీక్షకు 150 మార్కులు

యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష మొత్తం 150 మార్కులకు రెండు విభాగాల్లో నిర్వహిస్తారు.

పార్ట్ ఎ:  జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు-50 మార్కులు;

పార్ట్ బి:  పశుసంవర్ధక సంబంధిత సబ్జెక్టులో 100 ప్రశ్నలు- 100 మార్కుల పరీక్ష ఉంటుంది.

ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మరియు తెలుగు మాధ్యమంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. నెగెటివ్ మార్కుల నియమం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు తీసివేయబడుతుంది.

ఆకర్షణీయమైన జీతం

రాత పరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా..ఆ తర్వాత జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఎంపిక ప్రక్రియలో మెరిట్ లిస్టులో నిలిచి నియామకం ఖరారు చేస్తే.. ఆకర్షణీయమైన వేతనంతో కొలమానం వస్తుంది. ప్రారంభ వేతన శ్రేణి రూ.22,460-రూ.72,810.

రెండేళ్ల ప్రొబేషన్

ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. ఈ సమయంలో వారికి నెలకు రూ.15 వేల చొప్పున చెల్లిస్తారు. రెండేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత పూర్తి వేతనం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.12.23

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10.12.23

హాల్ టిక్కెట్ల జారీ:  27.12.23 నుండి

పరీక్ష తేదీ: 31.12.23


పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://apaha-recruitment.aptonline.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government Jobs in Own Mandals" 1,896 Jobs in Village Secretariats"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0