Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

REVANGH REDDY

జడ్పీటీసీ నుంచి సీఎం దాకా  రేవంత్ రెడ్డి ప్రస్థానం

REVANGH REDDY

  • జడ్పీటీసీ నుంచి సీఎం దాకా ఎదిగిన నేత
  • స్టూడెంట్ లీడర్​గా ప్రస్థానం ప్రారంభం
  • ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీ, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • కాంగ్రెస్ స్టేట్ చీఫ్​గా పగ్గాలు చేపట్టి పార్టీకి పూర్వవైభవం తెచ్చిన నాయకుడు

రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం రేవంత్ రెడ్డి. ఆయన జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సీఎం దాకా ఎదిగారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, అన్నింటినీ అధిగమించుకుంటూ తనను తాను నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తొలి అడుగులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా అనూహ్య విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా గెలిచి సంచలనం సృష్టించారు. మొదట టీడీపీలో, ఆ తర్వాత కాంగ్రెస్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్​లో చేరిన తక్కువ కాలంలోనే ఆ పార్టీకి స్టేట్ చీఫ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి, ఇప్పుడు సీఎంగా పగ్గాలు చేపడుతున్నారు.

సొంతూరు కొండారెడ్డిపల్లి.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్​ 8న పుట్టారు. ఆయన సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్ కు ఆరుగురు అన్నదమ్ములు, ఒక అక్క ఉన్నారు. వీరిలో రేవంత్ ఐదోవాడు. సొంతూరులోనే ప్రాథమిక విద్య పూర్తి చేసిన రేవంత్.. వెల్దండ మండలంలోని తాండ్రలో ఆరో తరగతి, వనపర్తిలో హైస్కూల్, ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశారు. డిగ్రీ చదువుకుంటూనే ఏబీవీపీలో పని చేశారు. అదే టైమ్ లో ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన 'జాగృతి' పేపర్ లో పని చేశారు. అనంతరం కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ నడిపించారు.

జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభం

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం జడ్పీటీసీగా మొదలైంది. ఆయన 2004లో అప్పటి టీఆర్ఎస్​లో చేరారు. 2006లో మిడ్జిల్ మండల జడ్పీటీసీ టికెట్ ఆశించారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా టికెట్ దక్కలేదు. దీంతో రేవంత్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి, ప్రతిపక్షాల మద్దతును కూడగట్టి జడ్పీటీసీగా విజయం సాధించారు. తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అనంతరం 2008లో టీడీపీలో చేరారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ క్యాండిడేట్ గుర్నాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మళ్లీ 2014లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గుర్నాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

రేవంత్.. గీత.. ఓ లవ్ స్టోరీ

చదువుకునే రోజుల్లోనే రేవంత్​ ప్రేమలో పడ్డారు. ఆయన లవ్​స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్ ​చదివే రోజుల్లో తన క్లాస్​మేట్​ గీతారెడ్డిని రేవంత్ ప్రేమించారు. రేవంత్ వ్యక్తిత్వం నచ్చి ఆమె కూడా ఓకే చెప్పారట. కానీ, గీత ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. అయితే, ఆమె మాత్రం తాను రేవంత్​నే పెండ్లి చేసుకుంటానంటూ తేల్చి చెప్పారట. గీత.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డికి తమ్ముడి బిడ్డ. రేవంత్​తో పెండ్లి ప్రస్తావన రావడంతో ఇంట్లోవాళ్లు ఆమెను ఢిల్లీలోని జైపాల్​రెడ్డి ఇంటికి పంపించేశారు. ఇటు రేవంత్​పైనా రాజకీయంగా ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి జైపాల్​రెడ్డితో మాట్లాడేశారట. గీతను తనకిచ్చి పెండ్లి చేయాలంటూ ధైర్యంగా అడిగారట. రేవంత్ ధైర్యం నచ్చి జైపాల్ రెడ్డి తన తమ్ముడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. దీంతో 1992 మే 7న రేవంత్, గీతారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వాళ్లకు ఒక కూతురు ఉన్నారు.

2017లో కాంగ్రెస్ లోకి

అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2017లో రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేసి.. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి, అప్పటి టీఆర్ఎస్ క్యాండిడేట్ మర్రి రాజశేఖర్ రెడిపై 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2021 జులైలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 భారీ మెజార్టీతో విజయం సాధించారు.

సొంతూరు జనం సంతోషం.

రేవంత్ ను సీఎంగా ప్రకటించడంతో ఆయన సొంతూరు నాగర్​కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లె జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ఊరి పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని సంబురపడుతున్నారు. ఇది తమ ఊరికి దక్కిన గౌరవమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ''రేవంత్ అందరితో కలుపుగోలుగా ఉంటారు. ఆయన ఎక్కడున్నా దసరా రోజు మాత్రం సొంతూరుకు వచ్చి జమ్మి పూజలో పాల్గొనేవారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా, కొత్తబండి కొన్నా ఊళ్లోని ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసేవారు' అని గుర్తు చేసుకున్నారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

1992

విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌లో స‌భ్యుడయ్యారు.

2004

 ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు.

2006

 2006లో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ మండలం నుండి ZPTC సభ్యునిగా ఎన్నికయ్యారు.

2008

 శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు.రేవంత్ రెడ్డి టీడీపీలో మ‌రోసారి చేరారు.

2009

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు.

2014

 కొడంగ‌ల్ నుంచి మ‌రోమారు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

2015

 ఒక శూల‌శోధ‌న ఆప‌రేష‌న్‌లో దొరికిపోవ‌టంతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేయాల్సిందిగా ఆంగ్లో-ఇండియ‌న్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌స‌న్‌కు డ‌బ్బులివ్వ‌జూపార‌న్న‌ది రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణ‌. జూన్ 30 నాడు తెలంగాణ హైకోర్టు ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిలును మంజూరు చేసింది. బెయిలు నిబంధ‌న‌ల‌ ప్ర‌కారం ఏసీబీ అనుమ‌తులు లేకుండా ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌రాన్ని దాట‌రాదు.

2017

 రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018

 తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ముగ్గురు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల‌లో ఒక‌రిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ టికెట్‌పై కొడంగ‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019

పార్లమెంటు సభ్యుడు

2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓటమి తరువాత,  2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి 10,919 ఓట్ల తేడాతో విజయవంతంగా పోటీ చేసి మొత్తం ఓట్లలో 38.63% సాధించారు. టీఆర్‌ఎస్‌ నుంచి తన సమీప ప్రత్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

2021

జూన్ 2021లో, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు .  అతను 7 జూలై 2021న కొత్త పాత్రను స్వీకరించాడు 

2023 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం 

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించాడు, ఆ పార్టీ 64 స్థానాలను గెలుచుకుంది, మెజారిటీ మార్కును దాటిన 4 స్థానాలను గెలుచుకుంది.  అతను కొడంగల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేసి,  ఒకప్పటి సీటులో గెలిచి, ఆ తర్వాతి స్థానంలో ఓడిపోయాడు.

ఈనెల 7వ తేదీన హైద్రాబాద్ లాల్ బాహుదూర్ శాస్త్రి గారి స్టడీయం లో తెలంగాణా "ముఖ్యమంత్రి" గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "REVANGH REDDY"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0