Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Trouble with the facial app

ఫేషియల్ యాప్ తో ఇక్కట్లు

Trouble with the facial app

  • సిఎల్ ఆప్లై చేస్తే ఆబ్సెంట్గా నమోదు
  • హాజరు నమోదుకు తర్జనభర్జన
  • యాప్ లో లోపాలను సరిచేయాలంటున్న ఉపాధ్యాయులు

ప్రభుత్వపాఠశాలలో నిత్యంఉపాధ్యాయుల హాజరు నమోదుకోసం విద్యా శాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరం నుండి ఫెషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ (ఎస్ఆర్ బిఎఎస్) విధానాన్ని అందు బాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫేషియల్ అటెండెన్స్ యాప్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుం డటం, ఆఫ్ శెలవుల విషయంలో ఆప్షన్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలతో ఉపాధ్యాయులు తర్జనభర్జన పడుతు న్నారు. మరో వైపు అధికారులు ఉదయం 9 గంటల 10 నిముషాల లోపు యాప్లో హాజరు నమోదు చేయని వారి పేర్లను విద్యా శాఖ కార్యాల యంలోని డేష్ బోర్డు ద్వారా కమీషనర్ నోటీసుకు పంపుతామంటూ ఒత్తిడి చేస్తున్నా రంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట యాప్లో సీఎల్ ఆప్లై చేసిన వారికి అబ్సెంట్గా చూపుతుండటంతో ఉపాధ్యాయులు తలలుప టుకుంటున్నారు. గతంలో పాఠశాలకు ఒక ట్యాబ్ను అందజేసి దాని ద్వారా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ అటెండన్స్ నమోదు చేశారు. ప్రస్తుం ఫేషియల్ యాప్ను ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా తమ స్మార్ట్ ఫోన్లో ఫేషియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఈ యేడాది దసరా పండుగ తరువాత అధికారులు ఉపాధ్యాయుల హాజరు విషయంలో నూతనంగా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ యాప్లో ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటల 10 నిముషాలలోపు హాజరు నమోదు చేయాలంటూ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. శెలవు కాలసిన వారు సైతం యాప్లోనె 9 గంటలలోపు క్యాజువల్ లీవ్ (సిఎల్) ఆప్లై చేయాలని ఆదేశిస్తూ మార్గ దర్శకాలను విడుదల చేశారు. ఉదయం పాఠశాలలకు వచ్చే సమయం, సాయంత్రం పాఠశాల నుంచి వెళ్ళే సమయాలలో (ఇన్స్టిమ్, ఔట్ టైమ్) నిత్యం తప్పనిసరిగా ఈ ఫేషియల్ యాప్ లో ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంది. ఈ యాప్ లో హాజరు నమోదుకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యా యులు ఇబ్బందులు పడుతున్నారు.

తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు

యాప్లో ఉదయం పూట సిఎల్ ఆప్లై చేస్తే రిపోర్ట్స్ లో ఆబ్సెంట్గా చూపిస్తోంది. దీంతో కొన్ని జిల్లాలలో కొంతమంది అధికారులు రెండు పూటలా సిఎల్ అప్ప్లై చేసి మధ్యాహ్నం వచ్చి హాజరు నమోదు చేసుకోవాలని, దీనివల్ల ఉదయం పూట ఆబ్సెంట్ కనిపించకుండా ఉంటుందని సూచిస్తున్నారు. కాని రెండో పూట వచ్చి హాజరు వేయబోతే యాప్ తీసుకోవడం లేదంటూ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఒక వేళ తీసుకున్నా సీఎల్ అప్లైచేశారు కనుక వీలుకాదు అని వస్తుందని వాపోతున్నారు. డీఈవో స్థాయిలో అధికారులను సంప్రదించినా పరిష్కారం దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక రెండవ పూట సిఎల్ పెట్టుకొని వెళ్లాలి అంటే ఉదయం తొమ్మిది లోపలే ఆపై చేయాలి అని యాప్లో చూపుతుంది. అత్యవసర సమయంలో మధ్యాహ్నం నుంచి శెలవు పెట్టవలసిన ఉపాధ్యాయులు ఎలా అప్లై చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఉదయం పూట సగం రోజుకి సెలవు పెట్టినవారు మధ్యాహ్నం నుంచి రెండవపూట కొనసాగించడానికి ప్రయత్నిస్తే 'డేట్ ఓవర్ లాప్ అనే' మెసేజి వస్తుందని, అలాంటి పరిస్థితులలో ఏం చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడుది. దీనివల్ల ఒక పూట శెలవు అపై చేసిన వారు రెండో పూటకి శెలవు అవసరమైతే కొనసాగించుకోలేకపోతున్నారు. ఈ యాప్ అప్డేట్ అయినప్పుడల్లా కొన్ని కొన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేయడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Trouble with the facial app"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0