We don't want first period in school,
బడిలో మొదటి పీరియడ్ మాకు వద్దు బాబోయ్..!
ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి పీరియడ్ అంటే ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరికి వారు మా కొద్దు బాబోయ్ అంటు న్నారు. బోధనేతర పనుల ఎక్కువగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పనుల కారణంగా బోధనకు సమయం సరిపోని దుస్థితి ఏర్పడుతోంది. మొదటి పీరియడ్ లో విద్యార్థుల ఆన్లైన్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆన్లైన్ యాప్లో హాజరు నమోదు. ఆఫ్లైన్ రిజిస్టర్ హాజరు వేసేందుకే 10నిమిషాల సమయం పడుతోంది. దీనికితోడు ఇప్పుడు కొత్తగా విద్యార్థులు వరసగా మూడు రోజులు గైర్హాజరైతే దీనికి కారణాన్ని నమోదు చేయాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది. హాజరు యాప్లో దీన్ని చేర్చారు. మొదటి పీరియడ్లో వారికి అదనపు పనిగా మారింది. దీని తర్వాత ఐరన్ మాత్రల పంపిణీ వివరాల నమోదుకు మరి కొంత సమయం పడుతోంది. ఉదయం అసెంబ్లీలో ఏదైనా ప్రత్యేక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్ణీత సమయం కంటే సమయం ఎక్కువ పడుతోంది. దీంతో తరగతి ప్రారంభమయ్యేందుకు ఆలస్యమవుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల వివరాల నమోదుతో మొదటి పీరియడ్ పాఠాలు చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. దీంతో సిలబస్ పూర్తికావడం లేదనే భయం వెంటాడుతోంది. పరీక్షల సమయా నికి సిలబస్ పూర్తి చేయకపోతే ఉన్నతాధికారుల తనిఖీల్లో షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వీటన్నింటితో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు
0 Response to "We don't want first period in school, "
Post a Comment