Even if he earns Rs.12 lakhs annually, he does not need to pay a single rupee of tax. Details.
ఏటా రూ.12 లక్షలు సంపాదిస్తున్నా ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. వివరాలు.
సంపాదిస్తున్న డబ్బుపై పన్ను ఆదా చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ట్యాక్స్ సేవ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా ఎక్కువ శాలరీ అందుకుంటున్న వారికి మరింత కష్టంగా ఉంటుంది.
అయితే ఏడాదికి రూ.12 లక్షలు జీతం అందుకుంటున్నా కొన్ని మార్గాల్లో ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని లేదు. ఇందుకు భారత పన్ను చట్టాల ప్రకారం లభించే వివిధ డిడక్షన్లు, ఎగ్జమ్షన్లను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే చాలు. 'ఇండియా హెరాల్డ్' రిపోర్ట్ ప్రకారం ట్యాక్స్‌ను పూర్తిగా మాఫీ చేసే మార్గాలేవో చూద్దాం.
శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది?
జీరో-ట్యాక్స్ ఇన్‌కమ్ అందుకునేందుకు, ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచుకునేందుకు శాలరీ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకోవాలి. శాలరీ ప్యాకేజీలో బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్(HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA), టెలిఫోన్ బిల్లుల వంటి రీయింబర్స్‌మెంట్లు వంటి వివిధ భాగాలు ఉండవచ్చు. ఈ భాగాలు ప్రతి ఒక్కటి పన్ను ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
- స్టాండర్డ్, స్పెసిఫిక్ డిడక్షన్‌లు
- స్టాండర్డ్ డిడక్షన్
జీతం పొందే ఉద్యోగిగా, మీరు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌కి అర్హులు. దీన్ని గ్రాస్ శాలరీ నుంచి నేరుగా డిడక్ట్ చేస్తారు.
HRA, LTA
ట్యాక్స్ ప్లానింగ్‌లో HRA, LTA కీలకమైన అంశాలు. మీ జీతంలో హెచ్‌ఆర్‌ఏ రూ.3.60 లక్షలు, LTA రూ.10,000, ఈ మొత్తాలపై స్పెసిఫిక్ కండిషన్స్‌లో డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. ఇది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది.
టెలిఫోన్ బిల్ రీయింబర్స్‌మెంట్
కంపెనీ టెలిఫోన్ బిల్లు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తే, ఇది మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మరింత తగ్గించవచ్చు. రూ.6,000 క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80 డిడక్షన్‌లు
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 కింద అనేక డిడక్షన్‌లు అందిస్తుంది. మీరు వీటిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు క్లెయిమ్ చేయవచ్చు. LIC, PPF, EPF, పిల్లల స్కూల్ ఫీజు వంటి నిర్దిష్ట పెట్టుబడులు, ఖర్చులు దీని పరిధిలోకి వస్తాయి. అలానే సెక్షన్ 80CCD కింద నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ.50 వేలు అదనపు డిడక్షన్ లభిస్తుంది. సెక్షన్ 80D ద్వారా కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ.75,000 (మీకు రూ.25,000, సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు రూ.50,000) డిడక్షన్‌లు క్లెయిమ్ చేయవచ్చు.
రూ.12 లక్షల జీతంలో ఈ డిడక్షన్‌లు తీసేస్తే..
- గ్రాస్ శాలరీ: రూ. 12,00,000
- మైనస్ స్టాండర్డ్ డిడక్షన్: రూ.50,000
- మైనస్ HRA: రూ.3,60,000
- మైనస్ LTA: రూ.10,000
మైనస్ టెలిఫోన్ రీయింబర్స్‌మెంట్: రూ.6,000
- ఈ డిడక్షన్‌ల తర్వాత, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7,74,000.
- ఇప్పుడు సెక్షన్ 80 డిడక్షన్‌లు అప్లై చేస్తే..
- మైనస్ సెక్షన్ 80C డిడక్షన్‌లు: రూ. 1,50,000
- మైనస్ సెక్షన్ 80CCD డిడక్షన్‌లు: రూ. 50,000
- మైనస్ సెక్షన్ 80D డిడక్షన్‌లు: రూ. 75,000
- ఇప్పుడు మీ పన్ను పరిధిలోకి వచ్చే మిగిలిన ఆదాయం రూ.4,99,000.
జీరో ట్యాక్స్ ఎలా సాధించవచ్చు?
పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.4,99,000 అనేది, రూ.5 లక్షల థ్రెషోల్డ్ కంటే తక్కువ. కాబట్టి సెక్షన్ 87A కింద పన్ను రాయితీకి అర్హత ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ సున్నా.
0 Response to "Even if he earns Rs.12 lakhs annually, he does not need to pay a single rupee of tax. Details."
Post a Comment