Vijayawada Ambedkar Statue
Vijayawada Ambedkar Statue: కొత్త చరిత్ర సృష్టించనున్న అంబేద్కర్ విగ్రహం-ప్రత్యేకతలివే.
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. జనవరి 21న సీఎం వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది. అంతే కాదు చారిత్ర స్వరాజ్ మైదాన్ లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి.
విజయవాడలో సుపరిచితమైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లేదా స్వరాజ్ మైదాన్ ను వైసీపీ ప్రభుత్వం భారీ అంబేద్కర్ ప్రతిమ ఏర్పాటుకు ఎంచుకుంది. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ఇక్కడ ప్రతిష్టించారు. దీంతో మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు మార్చారు.
ఏపీ ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చునే వీలున్న కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టు, పిల్లలకు ఆటస్ధలం, జల వనరులు, మ్యూజికల్ ఫౌంటేన్, నడక దారుల్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం నిర్మాణాల్ని నోయిడాలోని మెసర్స్ డిజైన్ అసోసియేట్స్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది.
2021 డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ ప్రాజెక్టు రెండేళ్లకు పైగా సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్ తో తయారు చేశారు. ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహా మండలంగా రూపొందించారు. ఈ నిర్మాణం మొత్తం పైల్ ఫౌండేషన్‌తో 30మీటర్ల పైల్ లోతు, షీర్ గోడలు, 50డిగ్రీల వంపుతిరిగిన ఆర్సీసీ స్లాబ్‌లు, బీమ్‌లతో 539 పైల్స్‌తో తయారు చేశారు.
పెడెస్టల్ బిల్డింగ్ మొత్తం 11,140 కమ్ కాంక్రీటు, 1445MT టీఎంటీతో తయారు చేశారు. రాజస్థాన్ నుండి పింక్ ఇసుకరాయితో క్లాడింగ్ చేశారు.
అంబేద్కర్ స్మారక చిహ్నం ముందుభాగంలో ఆరు జలవనరులు ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, పీఠం భవనం, పచ్చదనం కోసం 3 వైపుల పెరిఫెరల్ వాటర్‌బాడీతో ప్రకృతిని మైమరపింప చేస్తోంది. కాలచక్ర మహా మండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేద్కర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. బేస్మెంట్ లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే 8 వేల చదరపు అడుగుల్లో ఫుడ్ కోర్ట్ నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం తూర్పు, పడమర వైపు స్ధలం కేటాయించారు. ఇందులో 95 కార్లు, 84 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు
0 Response to "Vijayawada Ambedkar Statue"
Post a Comment