Age 6 Should Be The Minimum Age For Class 1 Students Across All States
6 ఏళ్లు నిండిన వారికే 1వ తరగతిలో అడ్మిషన్స్..మోడీ సర్కార్ ఆదేశాలు
మోడీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లల చదువు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది.
Age 6 Should Be The Minimum Age For Class 1 Students Across All States
2024 – 25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్ 1/ఒకటో తరగతిలో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది విద్యాశాఖ. ఇక తమ ఆదేశాలు పాటించాలని.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్రం.
కార్పొరేట్ పాఠశాలలకు బిగ్ షాక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, కీలక ఉత్తర్వుల జారీ
ప్రస్తుతం రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలల హవా కొనసాగుతోంది. ఓ వైపు జనం ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు, ఖర్చులతో విలవిలలాడుతుంటే మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను ఫీజుల పేరుతో పిండేస్తున్నాయి.
ఏకంగా స్కూళ్లలోనే యునిఫాం, నోట్‌బుక్స్ పేరుతో వ్యాపారం చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతూ.. పిల్లల ప్రాణాలకు సైతం లెక్క చేయడం లేదు.
ఈ నేపథ్యంలోనే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు, పాఠశాల విద్యా విధానంలో నూతన మార్పులు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట 6 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్-1 ఒకటో తరగతిలో తప్పనిసరిగా ఆరేళ్లు నిండిన వారికే పాఠశాలు అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
0 Response to "Age 6 Should Be The Minimum Age For Class 1 Students Across All States"
Post a Comment