Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

bike Parcel: Want to send a bike home by rail? Let's find out its charge.

 Bike Parcel: మీరు రైల్వే ద్వారా ఇంటికి బైక్‌ను పంపాలనుకుంటున్నారా? దాని ఛార్జ్‌ ఎంతో తెలుసుకుందాం.

ప్రజలు ఒక ఊరు విడిచి మరో ఊరికి వెళ్లినప్పుడు తమ వస్తువులన్నింటితో పాటు స్కూటర్ లేదా బైక్ కూడా తీసుకుని వెళ్తారు. దీని కోసం చాలా మంది ప్రజలు రైలు సహాయం తీసుకుంటారు.

అలాగే బుక్ చేసిన తర్వాత తమ బైక్‌ను తీసుకుంటారు. కానీ చాలా మందికి తమ బైక్‌ను రైలులో లగేజీగా లేదా పార్శిల్‌గా ఎలా తీసుకెళ్లాలో తెలియదు. మీరు కూడా మీ బైక్‌ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే, దాని గురించి తెలుసుకోండి.

మీరు రైలులో ప్రయాణించకపోతే అలాగే మీరు మీ బైక్‌ను మరొక ప్రదేశానికి పంపవలసి వస్తే, దీని కోసం మీరు ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫోటోకాపీతో పార్శిల్ కార్యాలయానికి వెళ్లాలి. బైక్‌ను రవాణా చేయడానికి ముందు మీ వాహనం అన్ని పత్రాలను సిద్ధం చేయండి. ఇందులో బైక్‌కు సంబంధించిన బీమా, ఆర్‌సీ తప్పనిసరిగా ఉండాలి.

పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేయండి:

బైక్‌ను రవాణా చేస్తున్నప్పుడు దాని పెట్రోల్ ట్యాంక్‌ను జాగ్రత్తగా ఖాళీ చేయండి. కార్డ్‌బోర్డ్‌పై బయలుదేరే, వచ్చే స్టేషన్ పేరును స్పష్టంగా రాసి, ఆపై దానిని ద్విచక్ర వాహనానికి తగిలించండి. పార్శిల్ కార్యాలయంలో మీకు ఫారమ్ ఇవ్వబడుతుంది. ఇందులో పార్శిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది.. పోస్టల్ చిరునామా, వాహన కంపెనీ, రిజిస్ట్రేషన్ నంబర్, వాహనం బరువు, వాహనం ధర వంటి అన్ని వివరాలను కూడా నింపాల్సి ఉంటుంది. అలాగే మీ బైక్‌ను ప్యాక్‌ చేసేటప్పుడు సున్నితంగా ఉండే పార్ట్‌ను ప్యాకింగ్‌ మరింతగా ఉంటుంది. సైడ్‌ అద్దాలు, బ్రేక్స్‌, క్లిచ్‌ బటన్‌పై పూర్తిగా కప్పి ఉండేలా ప్యాక్‌ చేస్తారు రైల్వే సిబ్బంది. ఈ ప్యాకింగ్‌లో టైర్లు మాత్రమే బయటకు కనిపిస్తాయి. బైక్‌ పార్ట్‌ పూర్తిగా కప్పి ఉండేలా ప్యాకింగ్‌ చేస్తారు.

ఈ పత్రాన్ని కలిగి ఉండటం అవసరం

బైక్ ప్యాకింగ్ ఖర్చు దాదాపు రూ.300 అవుతుంది. ఇది దూరాన్ని బట్టి ఎక్కువ ధరల్లో మార్పులు ఉండవచ్చు.చాలా సార్లు అది వెయ్యి రూపాయలకు వరకు కూడా చేరుకుంటుంది. పార్శిల్ ఫారమ్ నింపేటప్పుడు, మీరు బైక్ ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. గ్రహీత పేరును పూరించడం కూడా అవసరం. దీని కోసం మీకు రసీదు అందజేస్తారు. మీరు బైక్ అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది అవసరం అవుతుంది. మీరు రసీదు అసలు కాపీని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా మీ బైక్‌ను గానీ, స్కూటర్‌ను గానీ రైళ్లలో పంపేటప్పుడు పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "bike Parcel: Want to send a bike home by rail? Let's find out its charge."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0