Heart attack
సడెన్‌గా కుప్పకూలుతారు. అంతలోనే మరణం!.. ఎందుకిలా?
'సడెన్ డెత్ సిండ్రోమ్'.:ఇటీవల రష్యన్ ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఈ వ్యాధి కారణంగానే మరణించినట్లు అతని తల్లి ప్రకటించింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలో దీని గురించిన డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ సడెన్ డెత్ సిండ్రోమ్ (SDS) అంటే ఏమిటి? అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇది కార్డియోవాస్క్యులర్ ఎటియాలజీకి ఒక గంటలోపు సంభవించే గుండె వైఫల్యం కారణంగా సంభవించే మరణంగా కొందరు నిపుణులు చెప్తున్నారు.l
డబ్ల్యుహెచ్‌ఓ ఏం చెప్తోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సడెన్ డెత్ సిండ్రోమ్‌కు క్లిష్టమైన, సుదీర్ఘమైన లక్షణాలు ఏమీ ఉండవు. ఒక వ్యక్తిలో ఆకస్మికంగా ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతుంది. ఆ సందర్భంలో అందరికీ తెలిసిన సహజ కారణాలవల్ల సంభవించే ఊహించని మరణమే ఇది. ఇలాంటి మరణాల్లో సడన్ కార్డియాక్ డెత్ (SCD), సడెన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) వంటివి ఉంటాయి. ప్రజలు సందర్భాన్ని బట్టి ఆయా పేర్లను యూజ్ చేస్తుంటారు. ఇందులో సడెన్ కార్డియాక్ డెత్ అనేది గుండె వైఫల్యం వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి చూస్తుండగానే కుప్పకూలి ఆకస్మికంగా మృతి చెందవచ్చు. ఇటీవలి కాలంలో అనేక వ్యాధులు, సంఘటనలు ఈ సడెన్ డెత్ సిండ్రోమ్‌కు దారితీస్తున్నాయి.
73 శాతం అవే ఉంటున్నాయి?
ఊహించని మరణాలో 73% వరకు హృదయ సంబంధ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయని 2022 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇంట్రా సెరెబ్రల్ హెమరేజ్, ఆస్తమా, మూర్ఛ వంటి ఇతర అనారోగ్యాలకు ఇవి భిన్నంగా ఉంటాయి. కాగా సడెన్ డెత్ సిండ్రోమ్‌కు సంబంధించిన కచ్చితమైన లక్షణాలు ఇప్పటి వరకు వైద్య చరిత్రలో రూపొందించబడలేదు. ఇది నిరూపించిన బడిన అనారోగ్యం కాదు కాబట్టి, అంతర్లీన కారణం ఉనికిలో ఉన్న ఏవైనా లక్షణాలపై ఆధారపడి ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇక 80 శాతం ఆకస్మిక మరణాలకు సికిల్ సెల్ వ్యాధి, 53 శాతం ఆకస్మిక మరణాలకు కరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా సంభవించే సడెన్ కార్డియాక్ డెత్ కేసులు ఉంటున్నన్నట్లు నిపుణులు చెప్తున్నారు.
రిస్క్ ఫ్యాక్టర్స్, నివారణ చర్యలు
సడెన్ డెత్ సిండ్రోమ్‌కి కారణమయ్యే వ్యాధుల సంఖ్యను కచ్చితంగా చెప్పలేం. ప్రతి ఆకస్మిక మరణం ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వాటిలో సడెన్ కార్డియాక్ అరెస్ట్ (SCD) అత్యంత సాధారణమైంది. అధిక మద్యపాన సేవనం, పొగాకు వినియోగం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఊబకాయం, అధిక రక్తపోటు, సడెన్ కార్డియాక్ డెత్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో ఇవి సంభవించవచ్చు. క్రానిక్ డిసీజ్ మేనేజ్‌మెంట్, జీవనశైలిలో మార్పుల ద్వారా సడెన్ డెత్ సిండ్రోమ్‌ను నిరోధించ వచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు మెడికల్ ఇంటర్వెన్షన్స్, జీవనశైలి మార్పులు హైరిస్క్ కార్డియో వాస్క్యులర్ బాధితుల్లో ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
0 Response to "Heart attack"
Post a Comment